telugu navyamedia
రాశి ఫలాలు

ఆగస్టు 23 (సోమవారం) రాశి ఫలాలు

మేషం: చేపట్టిన పనులు పట్టుదలగా పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారంలో సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆర్థికంగా పర్వాలేదు. శుభవార్తలు వింటారు.

వృషభం: ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు అనుకూల. ఉద్యోగంలో ప్రోత్సాహం ఉంటుంది. తల పెట్టిన పనులు కష్టంమీద పూర్తిచేస్తారు. ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధువులతో సఖ్యతగా ఉండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.

మిథునం: ఆర్థికంగా బాగుంటుంది. ఇప్పుడు తల పెట్టిన పనులు నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

కర్కాటకం: ఉద్యోగంలో మంచి పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. గృహ, వాహనయోగాలకు అవకాశం. రావాల్సిన డబ్బు అందుతుంది. శుభ వార్తలు వింటారు. వివాహ సంబంధాలకు అనుకూలం. మీవల్ల కొందరికి మేలు జరుగుతుంది. మీ తెలివితేటలతో కొన్ని సమస్యలను చక్కబెడతారు.

సింహం: ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగంలో అధికారుల ప్రోత్సాహం ఉంటుంది. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వివాహ సంబంధాలకు అనుకూలం. పెద్దలతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది.

కన్య: ఆర్థికంగా బాగుంటుంది. ఆటంకాలు ఎదురైనా చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలతో శ్రమ పెరుగుతుంది. వ్యాపారంలో శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. కుటుంబపరంగాను, ఉద్యోగపరంగాను మీరు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు.

తుల: ఉద్యోగ, వ్యాపారులకు అనుకూలం. రావాల్సిన డబ్బు సమయానికి చేతికి అందుతుంది. వ్యాపారం లాభదాయకం. బంధుమిత్రులకు మీ ద్వారా మేలు జరుగుతుంది. స్థాన మార్పునకు అవకాశం. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది.

వృశ్చికం: ఆర్థికంగా బాగుంటుంది. పట్టుదలతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగంలో తోటివారి సహకారం ఉంటుంది. బంధుమిత్రుల నుంచి ఒత్తిడి ఉంటుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలుంటాయి. కుటుంబ సభ్యుల సలహాలు పాటిస్తారు.

ధనుస్సు: ఉద్యోగ, వ్యాపారాల్లో పట్టుదలగా లక్ష్యాన్ని చేరే ప్రయత్నం చేస్తారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివాహ సంబంధాలకు అనుకూలం. మాట పట్టింపులకు పోవద్దు. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఆదాయం పెంచుకునే ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మనోబలం ముందుకు నడిపిస్తుంది.

మకరం: ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. కష్టంమీద కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. వ్యాపారులకు అనుకూలం. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సలహాలు పాటించండి.

కుంభం: ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగులకు మేలు జరుగుతుంది. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. శుభ కార్యాలు నిర్వహిస్తారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. శుభవార్తలు వింటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

మీనం: ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఉద్యోగపరంగా బాధ్యతలు, లక్ష్యాలు పూర్తి చేస్తారు. తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారులకు అనుకూలం. శుభవార్తలు వింటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. మీ వల్ల బంధుమిత్రులకు మేలు జరుగుతుంది.

Related posts