telugu navyamedia
రాశి ఫలాలు

అక్టోబర్9(శనివారం) రాశి ఫలాలు

మేషం : వృత్తి, వ్యాపారులకు అనుకూలం. ఒక ముఖ్యమైన కుటుంబ సమస్య పరిష్కారం అవుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. నిరుద్యోగులకు అనుకూలం. సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. అన్నింటా సమయం అనుకూలంగా ఉంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.

వృషభం : ఆర్ధిక స్థితి క్రమంగా మెరుగవుతుంది. ఉద్యోగులకు సమయం అనుకూలం. అనవసర ఖర్చులు తగ్గించుకోండి. చేపట్టిన ముఖ్యమైన పనులు చాలావరకు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలు పాటించండి.

మిథునం : నిరుద్యోగులుకు అనుకూలం. ఒక ముఖ్యమైన కుటుంబ సమస్య నుంచి బయటపడతారు. ఆరోగ్యం జాగ్రత్త. పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి.

కర్కాటకం :ఆధ్యాత్మిక కార్యక్రమల్లో పాల్గొంటారు. అన్నివిధాలా అనుకూలమైన సమయం ఇది. అవరోధాలు, ఆటంకాలు తొలగుతాయి. ఆర్ధికంగా కలిసి వస్తుంది. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త.

సింహం : ఖర్చులు తగ్గించుకోండి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఇంటాబయటా శుభమే జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో అభివృద్ధి ఉంటుంది.

కన్య : ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగుకలు అనుకూలం. వ్యాపారంలో, ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. బాధ్యతలను సమర్ధవంతంగా పూర్తి చేస్తారు.

తుల :- సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు అనుకూలం. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువులతో సమయం గడుపుతారు. పలుకుబడి పెరుగుతుంది. ఎవరికీ హామీలు ఉండొద్దు.

వృశ్చికం : రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. నిర్ణయాల వల్ల చాలావరకు మేలు జరుగుతుంది. ప్రారంభించిన పనుల్లో పురోగతి ఉంటుంది.

ధనస్సు : ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగులకు అనుకూలం. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. మిత్రుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.

మకరం : ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగులు తమ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారులకు అనుకూలం. ఆరోగ్యం జాగ్రత్త.

కుంభం : ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారులకు శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. అపార్థాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వవద్దు. ఓ కుటుంబ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది.

మీనం : శుభవార్త వింటారు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు జాగ్రత్తగా పూర్తి చేస్తారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో సత్ఫలితాలను ఇస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో విజయాలు అనుభవానికి వస్తాయి.

Related posts