telugu navyamedia
రాశి ఫలాలు

జ‌న‌వ‌రి 27, గురువారం రాశిఫ‌లాలు

మేషరాశి..

విద్యార్ధులు శ్ర‌మించాలి. బంధు, మిత్రులతో విబేధాలు ఏర్ప‌డ‌తాయి. అనుకున్న పనుల్లో అవాంతరాలు ఏర్ప‌డ‌తాయి. అప్పులు చేస్తారు. అనుకోని దూరప్రయాణాలు చేస్తారు. ఆలయాలు ద‌ర్శించుకుంటారు. వ్యాపారాలు మంద‌కొడిగా సాగుతాయి. ఉద్యోగ‌స్తుల‌కు పై అధికారులు నుంచి ఒత్తిడి పెరుగుతుంది.

వృషభరాశి..

వ్యాపారాలు విస్తృతమవుతాయి. ఆర్థికాభివృద్ధి పెరుగుతుంది. ముఖ్యమైన‌ కీలక నిర్ణయాలు తీసుకుంటారు. బందువులు నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఊహించని ఖర్పులు వల్ల ఆర్ధిక ఇబ్బందులు ఎదుర‌వుతాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నిరోద్యోగులు ఉద్యోగ‌వ‌కాశాలు వ‌స్తాయి.

మిథునరాశి..

ముఖ్యమైన విషయాల్లో పెద్దలను కలిసి నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో సంతోషంగా ఉంటారు. కష్టానికి ఫలితం ల‌భిస్తుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మంద‌కొడిగా సాగుతాయి. ఉద్యోగస్తుల‌కు పై అధికారులు నుంచి ప్ర‌శంస‌లు అందుకుంటారు.

కర్కాటకరాశి..

కొన్ని ముఖ్య పనుల్లో అవాంతరాలు ఏర్ప‌డ‌తాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. బంధువులతో గొడ‌వ‌లు ఏర్ప‌డ‌తాయి. ధనన‌ష్టం ఎక్కువ‌వుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. వ్యాపారాలు అంత‌గా క‌లిసి రావు. ఉద్యోగాలలో వివాదాలు ఏర్ప‌డ‌తాయి.

సింహరాశి..

బంధు, మిత్రులతో విందు వినోదకార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభవార్త వింటారు. సన్నిహితుల నుంచి ఒత్తిడులు ఏర్ప‌డ‌తాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్ర‌మ‌కు త‌గ్గ మంచి ఫ‌లితం ఏర్ప‌డుతుంది. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు న‌ష్టాల్లో ఏర్ప‌డుతుంది. ఉద్యోగస్లులు నిదానంగా ఉండ‌డం మంచిది.

కన్యరాశి..

నూత‌న పనులకు శ్రీకారం చుడ‌తారు. ఆత్మీయులతో వివాదాలు సర్దుకుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభం వ‌స్తుంది. దూరపు బంధువులతో సఖ్యత ఏర్ప‌డుతుంది. వాహనయోగం క‌లుగుతుంది. వ్యాపారాలు అంతంత‌మాత్రంగా ఉంటుంది. ఉద్యోగ‌స్తులు తోటి వారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు.

తులరాశి..

కుటుంబసభ్యులతో విభేదాలు ఏర్ప‌డ‌తాయి. ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి. ఆక‌స్మిక‌ ధనవ్యయం క‌లుగుతుంది. పనుల్లో అవాంతరాలు ఏర్ప‌డ‌తాయి.ఆరోగ్యంపై శ్ర‌ద్ద చూపించ‌డం మంచిది. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. విద్యార్ధులు చ‌దువుమీద శ్ర‌ద్ద చూపించ‌డం మంచిది.

వృశ్చికరాశి..

వృధా ఖర్చులు చేస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. సమాజంలో గౌరవం ఏర్ప‌డుతుంది. స్థిర ఆస్తి లాభం ఉంటుంది . కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. స్త్రీలకు ఆరోగ్యంలో చికాకులు ఏర్ప‌డుతాయి. వ్యాపారాల్లో సమస్యలు పరిష్కారం అవుతాయి.

ధనుస్సురాశి..

కుటుంబ సభ్యుల సహకారంతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ముఖ్యవిషయాల్లో అనుకూల ఫలితాలు ఏర్ప‌డ‌తాయి విద్యార్థులకు నిరుత్సాహం క‌లుగుతుంది. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు మంద‌గిస్తాయి, ఉద్యోగాలలో చికాకులు ఏర్ప‌డ‌తాయి.

మకరరాశి..

బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగప్రాప్తి క‌లుగుతుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఏర్ప‌డ‌తాయి. ముఖ్య‌మైన వారితో పరిచయాలు పెరుగుతాయి. వాహనయోగం క‌లుగుతుంది. వ్యాపారాలు సంతృప్తిక‌రంగా ఉంటుంది.

కుంభరాశి..

నిరుద్యోగులకు మంచి స‌మ‌యం ఆస‌న్న‌మైంది. ఉద్యోగ‌స్తులు ముఖ్యమైన పనులు పూర్తి చేసి పై అధికారుల ప్రశంసలను అందుకుంటారు.  కొత్త వ్యక్తుల పరిచయం.  వివాహయత్నాలు అనుకూలిస్తాయి.  వ్యాపారాలు విస్తరిస్తారు.

మీనరాశి..

దైవ సేవాకార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. బంధువులతో విభేదాలు ఏర్ప‌డ‌తాయి. ఆర్థిక పరిస్థితి ఇబ్బంది కలిగిస్తుంది. అనుకోని ప్రయాణాలు చేయ‌డం వ‌ల‌న చికాకు త‌ప్ప‌దు. భూవివాదాలు కొల‌క్కి వ‌స్తాయి. వ్యాపారాలు ముందుకు సాగుతాయి, ఉద్యోగస్తుల‌కు స్థాన మార్పిడి ఉంటుంది.

Related posts