telugu navyamedia
రాశి ఫలాలు

ఆగష్టు 6(శుక్రవారం) రాశి ఫలాలు

మేషం: ఉద్యోగ జీవితం సాఫీ గానే సాగిపోతుంది. లాయర్లకు పురోభివృద్ధి కానవస్తుంది. గృహంలో మార్పులు చేర్పులు అనుకూలంగా సాగుతాయి. చిట్స్, ఫైనాన్స్, బ్యాంకింగ్రంగాల్లో వారికి పనిభారం అధికం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

వృషభం: వస్త్ర, బంగారం, వెండి వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుంది.పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. స్త్రీలకు నూతన సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. సిమెంట్, ఐరన్, కలప, ఇటుక వ్యాపారస్తులకు స్టాకిస్టులకు కలిసిరాగలదు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు.

మిథునం: ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలనిస్తాయి.. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. లౌక్యంగా వ్యవహరించడం వల్ల కొన్ని వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. ద్విచక్రవాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి.

కర్కాటకం: రాజకీయాల్లో వారికి గణనీయమైన పురోభివృద్ధి కానవస్తుంది. సమయం అన్నివిధాలా అనుకూలంగా ఉంది. నిర్మాణ పనుల్లో స్వయం పర్యవేక్షణ చాలా అవసరం. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. రుణం తీర్చేందుకు చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ వ్యవహారాలకు తగిన సమయం కాదు.

సింహం: ఉద్యోగంలో మీ పనితీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఏదైనా అమ్మకానికి చేసే యత్నాలు వాయిదా పడగలవు. లిటిగేషన్, కోర్టు వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబీకులతో అవగాహన లోపం వంటివి ఎదుర్కొంటారు. వ్యాపారులు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు.

కన్య: ఆదాయ వ్యయాల్లో ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తారు. ఉమ్మడి వ్యాపారాలు సంతృప్తిగా సాగుతాయి. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల్లోని వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు.

తుల: ఆర్థికంగా పురోభివృద్ధి సాధించే యత్నాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు, రాత పరీక్షల్లో మెలకువ, ఏకాగ్రత అవసరం. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. కంది, మినుము, మిర్చి వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త.

వృశ్చికం: స్త్రీలు అపరిచిత వ్యక్తులతో మితంగా సంభాషించడం మంచిది. ఆడిటర్లకు పురోభివృద్ధి. పెద్దల ఆరోగ్యంలో సంతృప్తి కానవస్తుంది. రావలసిన ధనం అందుతుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఏజెంట్లకు, బ్రోకర్లకు, శ్రమ, విశ్రాంతి లోపం వంటి చికాకులను ఎదుర్కొంటారు.

ధనస్సు: గృహానికి కావలసిన వస్తువులను అమర్చుకుంటారు. సన్నిహితులతో కలిసి సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ఉపాధ్యాయుల తొందరపాటు తనం వల్ల సమస్యలు తలెత్తుతాయి. పాత మిత్రుల కలయికతో మీకెంతో సంతృప్తినిస్తుంది. ఇతరుల కుటుంబ విషయాల్లో తలదూర్చి సమస్యలను ఎదుర్కొంటారు.

మకరం: సైన్సు, గణిత రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. క్రయ విక్రయ రంగాల్లోని వారికి సంతృప్తి కనవస్తుంది. ఇంటర్వ్యూలలో శ్రద్ధ వహించండి. ఉద్యోగస్తులకు అధికారులతో ఏకీభావం కుదరదు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్, ఇన్వెర్టర్ రంగాల వారికి పురోభివృద్ధి. అవివాహితులకు అనుకూలమైన కాలం.

కుంభం: వ్యవసాయ రంగాల్లోని వారికి మెళకువ అవసరం. విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. కొద్దిపాటి శ్రమ మీద పనులు పూర్తవుతాయి. రాజకీయాల్లోని వారికి పార్టీ పరంగాను, అన్ని విధాల కలిసివస్తుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.

మీనం: కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి ఒత్తిడి తప్పదు. రిప్రజెంటేటివ్‌లకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. స్త్రీలు నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. బాకీలు తీరుస్తారు. స్నేహితుల సహకారం లభిస్తుంది. వ్యాపారుల ఆదాయం నిలకడగా ఉంటుంది. వస్త్ర, ఫోము, లెదర్, పీచు వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది.

Related posts