telugu navyamedia
రాశి ఫలాలు

సెప్టెంబర్ 27(సోమవారం) రాశి ఫలాలు

మేషం : ఆర్థిక పరిస్థితి పర్వాలేదు. ఆరోగ్యం మెరుగవుతుంది. సొంత నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. తలపెట్టిన పనుల్లో లాభం ఉంటుంది. ఉద్యోగంలో గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. వ్యాపారంలో ఆశించిన లాభాలు ఉంటాయి.

వృషభం : ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగులకు అనుకూలం. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఇతరుల సహకారంతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. శుభవార్తలు వింటారు. వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం. బంధుమిత్రుల సహాయం అందుతుంది.

మిథునం : ధనలాభం ఉంటుంది. ఉద్యోగులకు శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకం ఎదురైనా పూర్తి చేస్తారు. ఇతరులకు సహాయ పడతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

కర్కాటకం : ఆర్థికంగా పర్వాలేదు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. స్నేహితుల సహకారం ఉంటుంది. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు.

సింహం : ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యానికి ఢోకా లేదు. ఉద్యోగులకు మంచి గుర్తింపు లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారులకు అనుకూలం. చేపట్టిన పనులు పూర్తవుతాయి.

కన్య : ఆర్థికంగా పర్వాలేదు. పాత బకాయిలు వసూలు అవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. పెండింగ్ పనులు పూర్తిచేస్తారు.

తుల : ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారులకు లాభదాయకం. శుభవార్తలు వింటారు. సొంత నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. చేపట్టిన పనులు పూర్తిచేస్తారు.

వృశ్చికం : వృత్తి, వ్యాపారులకు లాభదాయకం. అవసరానికి డబ్బు అందుతుంది. ఉద్యోగులకు శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. శుభవార్తలు వింటారు. స్నేహితుల సలహా పాటిస్తారు. కుటుంబంలో సమస్యలు పరిష్కారమవుతాయి.

ధనస్సు : వృత్తి, ఉద్యోగ, వ్యాపారులకు లాభదాయకం. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ సభ్యుల సలహా పాటించండి. చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు.

మకరం : ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యం మెరుగు పడుతుంది. చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారారులకు అనుకూలం. స్థిరాస్తి కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. ఖర్చులను అదుపుచేయాలి.

కుంభం : ఆర్థికంగా పర్వాలేదు. ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు. కీలక సమస్యను పరిష్కారం చేస్తారు. చేపట్టిన పనులు పూర్తవుతాయి. స్నేహితుల సహకారం అందుతుంది. ప్రయాణాలకు అవకాశం. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.

మీనం : ఉద్యోగ, వ్యాపారులకు లాభదాయకం. చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. బంధు మిత్రుల సహకారం ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. అదనపు ఆదాయానికి ప్రణాళికలు వేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

Related posts