telugu navyamedia
రాశి ఫలాలు

ఆగస్టు 13 (శుక్రవారం) రాశి ఫలాలు

మేషం: ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగపరంగా మీరు తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. తల పెట్టిన పనులు పూర్తి చేస్తారు. దూర ప్రాంతాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. వ్యాపారులకు అన్ని విధాలా అనుకూలం. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. అపార్థాలకు తావులేకుండా చూసుకోవాలి.

వృషభం : ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. సానుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారంలో శుభ ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా బాగుంటుంది. భవిష్యత్తుకు అవసరమైన నిర్ణయాలు తీసుకుంటారు. అప్పులు చెల్లిస్తారు. వృత్తి నిపుణులకు కలిసొచ్చే కాలం. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి.

మిథునం: అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. మంచి నిర్ణయాలు భవిష్యత్తుకు బాటలు వేస్తాయి. ఉద్యోగంలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారులకు అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం. మంచి పరిచయాలు ఏర్పడతాయి. శుభ కార్యాల్లో పాల్గొంటారు.

కర్కాటకం: ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభవార్తలు వింటారు. ఆదాయం పెంచుకునే ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. కుటుంబంలో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృత్తి నిపుణులకు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తిచేస్తారు.

సింహం: ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మనోధైర్యంతో ముందుకు వెళ్లండి. ఉద్యోగంలో తోటివారి సహకారం అందుతుంది. శుభవార్తలు వింటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.

కన్య: ఉద్యోగంలో అధికారుల ప్రోత్సాహం ఉంటుంది. ఆటంకాలను అధిగమిస్తారు. అవసరానికి డబ్బు అందుతుంది. వ్యాపారంలో సమస్యలు ఎదురవుతాయి. ఒత్తిడికి గురి కాకుండా చూసుకోవాలి. మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. మీ మనోబలమే మిమ్మల్ని గెలిపిస్తుంది.

తుల: శుభ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉద్యోగం సాఫీగా సాగిపోతోంది. చేస్తున్న పనులలో పురోగతి ఉంటుంది. ఆర్థికంగా బాగుంటుంది. భవిష్యత్తుకు సంబంధించి అవసరమైన ప్రణాళికలు వేస్తారు. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం.

వృశ్చికం: శుభవార్తలు వింటారు. మీ ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే మీరు అనుకున్నవి సాధిస్తారు. జీవితంలో స్థిరత్వం ఏర్పడే సూచనలున్నాయి. ఉద్యోగంలో ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. వివాదాలకు సమయం కాదు.

ధనుస్సు: ఆత్మీయుల నుంచి సహకారం పొందుతారు. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో అవకాశాలు కలిసి వస్తాయి. తగినంత ప్రయత్నం చేస్తే విజయం సాధిస్తారు. మీ వల్ల ఇతరులకు మేలు జరుగుతుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. వ్యాపారంలో విశేషమైన పురోగతి కనిపిస్తోంది.

మకరం : ఉద్యోగంలో అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆదాయం పెరిగే సూచనలున్నాయి. శ్రమతో ముఖ్యమైన పనులు పూర్తిచేస్తారు. వ్యాపారపరంలో శ్రమ ఎక్కువవుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి నిపుణులు కష్టపడాల్సి ఉంటుంది.

కుంభం : చేపట్టిన పనులను మనోబలంతో పూర్తవుతాయి. అవరోధాలు, ఆటంకాలు తొలగిపోతాయి. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. పనిలో ఒత్తిడి ఉంటుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మీనం: ఆర్థికంగా బాగుంటుంది. కొన్ని ఆటంకాలు ఎదురైన చేపట్టిన పనుల్లో అనుకూలంగా ఫలితం సాధిస్తారు. ముఖ్య కార్యాలు అతి కష్టం మీద పూర్తవుతాయి. ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అవసరం. మిత్రులను కలుసుకుంటారు.

Related posts