telugu navyamedia
రాశి ఫలాలు

డిసెంబర్‌ 11, శనివారం రాశిఫలాలు

మేష రాశి

కుటుంబ సభ్యుల సహకారం తీసుకుంటారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. నిలిచిపోయిన పనులు సైతం పూర్తి చేస్తారు.దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆరోగ్యం అంత‌గా స‌హ‌క‌రించ‌దు.

వృషభ రాశి

ఆరోగ్యంపై దృష్టి సారించాలి. మానసిక శక్తి పెంచుకోవడం మంచిది. ఉద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. కొత్తగా చేపట్టిన వ్యాపారాలు ఏమంత సంతృప్తికరంగా సాగవు. సంఘంలో పలుకుబడి కల వ్యక్తుల సహకారంతో మీ పనులు సానుకూలమవుతాయి.

మిథున రాశి..

దైవ, సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా వ్యవహరిస్తారు. నూతన వ్యక్తుల పరిచయం వల్ల కొత్త అనుభూతికి లోనవుతారు. సమయానికి డబ్బు చేతికి అందుతుంది. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబంలో ఒత్తిడులు అధిక‌మ‌వుతాయి.

కర్కాటక రాశి..

ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం మంచిది. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహ పరుస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధు మిత్రులను ఇంటికి ఆహ్వానిస్తారు. ఓర్పు, నేర్పు, అంకితభావంతో పనిచేసి పెద్దలను మెప్పిస్తారు. సమాజంలో గౌర‌వం ల‌భిస్తుంది.

సింహ రాశి..

అధికారులతో మంచి సంబంధాలు ఏర్పర్చుకుంటారు. సమస్యలను అధిగమిస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. సాంఘిక, సాంస్కృతిక, సినిమా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇతరుల మెప్పుకోసం శ్రమాధిక్యత, ఒత్తిడి ఎదుర్కొనవలసి వస్తుంది.

కన్య రాశి..

అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. బంధువులతో విబేధాలు వచ్చే అవకాశాలున్నాయి. జాగ్రత్తగా ఉండటం మంచిది. మనసును ప్రశంతంగా ఉంచుకోవాలి. బంధువులతో కలిసి వేడుకలు, విందులలో పాల్గొంటారు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.

తుల రాశి..

ముఖ్యమైన ఓ పనిని పూర్తి చేయగలుగుతారు. దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉండకపోవచ్చు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. గృహం కొనుగోలు చేస్తారు.శ్ర‌మ‌కు త‌గ్గ ఫ‌లితం ఉండ‌దు. అనారోగ్యం బాధ క‌లిగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

వృశ్చిక రాశి..

చేపట్టే పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృథా ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. గోసేవా చేయడం వల్ల మంచి జరుగుతుంది. మిత్రులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. బంధువులతో తగాదాలు ఏర్ప‌డ‌తాయి. ఆరోగ్యం మందగిస్తుంది.దైవ ద‌ర్శ‌నాలు చేస్తారు.

ధనుస్సు రాశి..

పనులు విజయవంతంగా ముగిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు ఫలిస్తాయి. రంగాలలో ఎదురయ్యే ఆటంకాలను అధిగమించే ప్రయత్నం చేస్తారు. ముఖ్యమైన పనులను చేపడతారు. రాజకీయ నాయకులు సభలు, సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ల‌భిస్తుంది.

మకర రాశి..

కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఎంత శ్రమించినా త‌గిన‌ ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు ఏర్ప‌డ‌తాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదుర‌వుతాయి. దూరప్రయాణాలు చేస్తారు .ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అనవసరమైన విషయాలలో జోక్యం కలిగించుకోకపోవడం మంచిది. దైవ ఆరాధ‌నలో ఉండ‌డం మంచింది.

కుంభ రాశి..

శ్రమ పెరుగకుండా చూసుకోవాలి. కుటుంబీకులతో కలసి వేడుకలలో పాల్గొంటారు. విద్యార్థులకు అత్యుత్సాహం మంచిది కాదు. కొన్ని వ్యవహారాలలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ధైర్యంతో ముందుగా సాగితే మంచి ఫలితాలు ల‌భిస్తాయి. కొత్త పనులు చేపడతారు. దైవ‌, సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.

మీన రాశి..

ముఖ్యమైన విషయాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఎంతో మంచిది. బంధువులతో తగాదాలు నెల‌కొంటాయి. అనారోగ్యం బారిన ప‌డ‌తారు. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. పెద్దలను సంప్రదించి త‌ల‌పెట్టిన ప‌నులు చేయడం మంచిది. దైవ ద‌ర్శ‌నాలు చేస్తారు.

Related posts