telugu navyamedia
రాశి ఫలాలు

డిసెంబర్ 28, మంగళవారం రాశిఫలాలు

మేషరాశి..

కళాకారులకు, రచయితలకు, పత్రికా రంగంలో వారికి శ్రమ అధికమవుతుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. ఆలోచనలు కలసివస్తాయి. వ్యాపారాలు మంచి రోజులు వ‌స్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం.

వృషభరాశి..

మిత్రులు, బంధువులతో తగాదాలు ఏర్ప‌డ‌తాయి. వృత్తి, వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం ఉండదు. ఉద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. నూతన రుణాలు చేయవలసి రావచ్చు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వ‌స్తాయి. ఆరోగ్య సమస్యలు త‌లెత్తుతాయి. విచిత్రమైన సంఘటనలు జ‌ర‌గ‌వ‌చ్చు.

మిథునరాశి..

ముఖ్య విషయాల్లోఇంట్లో వాళ్ల‌ సలహాలు స్వీక‌రించ‌డంవ‌ల‌న మంచి జ‌ర‌గుతుంది. ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. పనుల్లో అవాంతరాలు ఏర్ప‌డ‌తాయి. బంధువులతో తగాదాలు నెల‌కొంటాయి. వ్యాపారమున సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో స్థాన చలన సూచనలు తప్పవు. అనారోగ్యం బారిన ప‌డ‌తారు.

కర్కాటకరాశి..

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు విస్తరణకు అవరోధాలు తొలగుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. చిన్ననాటి మిత్రులను క‌లుసుకుంటారు. విందువినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి.

సింహరాశి..

మంచి పనులు చేపడతారు. రుణయత్నాలు. ఆస్తి వివాదాలు వివాదాలు మరింత చికాకు పరుస్తాయి. దూరప్రయాణాలు. దైవదర్శనాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. శ్రమకు త‌గ్గ‌ గుర్తింపు దక్కుతుంది. మానసిక ఒత్తిడిలు పెరుగుతాయి.

కన్యరాశి..

ఆదాయాన్ని పెంచుకునేందుకు చేసే ప్ర‌యత్నాల్లో అంత‌గా క‌లిసిరావు. ఉద్యోగస్తుల బాధ్యతల్లో ఏకాగ్రత వహించండం మంచిది. ఎప్ప‌టినుంచో బాధిస్తున్న సమస్యలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. పరిచయాలు పెరుగుతాయి. వాహనయోగం క‌లుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందుల‌నుంచి బ‌య‌ట‌ప‌డ‌తారు.

తులరాశి..

ఇంటాబయటా సమస్యలు అధికమవుతాయి వృత్తి వ్యాపారాలలో తొందరపడి సొంత నిర్ణయాలు తీసుకుని నష్టపడతారు. బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యసమస్యలు బాదిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలు తొలుగుతాయి. బంధు మిత్రులతో మ‌న‌స్పర్ధలు తలెత్తుతాయి

వృశ్చికరాశి..

కుటుంబంలో సమస్యలు తీరతాయి. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. స‌మాజంలో పలుకుబడి పెరుగుతుంది. అనుకోని సంఘటనలు ఎదుర‌వుతాయి. ధనప్రాప్తి క‌లుగుతుంది.

ధనుస్సురాశి..

చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. ఆప్తుల నుంచి సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ సత్తా చాటుకుంటారు.ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

మకరరాశి..

పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికామౌతుంది. నూతన ఋణ యత్నాలు కలసిరావు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. ఇంటాబయటా బాద్యతలు పెరుగుతాయి. కష్టపడ్డా ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

కుంభరాశి..

సన్నిహితులతో తగాదాలు. ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి. దూరప్రయాణాలు చేస్తారు. మీరు చేసే ప‌నిలో శ్రమ పెరుగుతుంది. బంధువుల నుంచి ఒత్తిడులు. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి.

మీనరాశి..

కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి. ఉద్యోగయత్నంలో నిరుత్సాహం వీడండి. మిత్రుల నుంచి ఒక ముఖ్య సమాచారం సేకరిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ముఖ్య‌మైన‌ పనులు చకచకా కొనసాగుతాయి. త్తి,ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ఆస్తి గొడ‌వ‌లు కొల‌క్కి వ‌స్తాయి.

Related posts