telugu navyamedia
రాశి ఫలాలు

నవంబర్ 24, బుధవారం రాశిఫలాలు..

మేషరాశి..

ముఖ్య‌మైన వ్యవహారాలలో అవాంతరాలు ఏర్ప‌డ‌తాయి. వ్యయప్రయాసలు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. ఉపాధ్యాయులకు గణనీయమైన పురోభివృద్ధి.దైవదర్శనాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ క‌లిగిస్తాయి.

వృషభరాశి..

సన్నిహితుల నుంచి సాయం అందుతుంది. రాజకీయ నాయకులు సభ, సమావేశాల్లో పాల్గొంటారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. వస్తులాభాలు క‌లుగుతాయి. శారీరక శ్రమ కాస్త పెరగుతుంది. పరిచయాలు పెరుగుతాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

మిథునరాశి..

అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యవహారాలలో జాప్యం. బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిడులు ఎక్కువ‌వుతాయి. దూరప్రయాణాలు చేస్తారు. ఒప్పందాలు వాయిదా ప‌డ‌తాయి. ఆరోగ్య సమస్యలు బాధ‌పెడ‌తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

కర్కాటకరాశి..

కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లకు చికాకులు తప్పవు. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తిలాభం. పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం లభిస్తుంది. మీ మీ రంగాల్లో మనోధైర్యంతో ముందుకు సాగాలి. బుద్ధిబలాన్ని ఉపయోగించి ఆటంకాలను అధిగమిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.

సింహరాశి..

ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు ఏర్ప‌డ‌తాయి. మిత్రులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. దూరప్రయాణాలలో మెళుకువ అవసరం. శత్రువులు మీ మీద విజయం సాధించలేరు.ఉపాధ్యాయులకు అనుకూలం ఉంటుంది.

కన్యరాశి..

శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబంలో కాస్త ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. రుణబాధలు తొలగుతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. విందువినోదాలు పాల్గొంటారు. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

తులరాశి..

ఇంటర్వ్యూలు అందుకుంటారు. అనవసర ఖర్చులు పెరిగే అవ‌కాశ‌ముంది. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. వస్తు, వస్త్రలాభాలు ఉంటాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి.

వృశ్చికరాశి..

బంధుమిత్రులతో అభిప్రాయ బేధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. అనుకోని ధనవ్యయం ఏర్ప‌డ‌తాయి. కుటుంబంలో సమస్యలు త‌లెత్తుతాయి. దూరప్రయాణాలు చేస్తారు. ఇంటికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

ధనుస్సురాశి..

బంధుమిత్రుల సహకారంతో పనులు పూర్తి చేయగలుగుతారు. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి.ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. ఆస్తి వివాదాలు ఏర్ప‌డ‌తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు ఎదుర‌వుతాయి.

మకరరాశి..

ముఖ్య‌మైన‌ వ్యవహారాలలో విజయం. ధనధాన్య లాభాలు ఉన్నాయి. శుభవార్త వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విచిత్ర సంఘటనలు ఎదుర‌వుతాయి. చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఖాతాదారులతో సమస్యలు తప్పవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు క‌లుగుతాయి.

కుంభరాశి..

పనులలో ఆటంకాలు క‌లుగుతాయి.రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో ఇబ్బందులెదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో మీకు ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దైవదర్శనాలు చేస్తారు.

మీనరాశి..

సన్నిహితులతో వివాదాలు ఏర్ప‌డ‌తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం క‌లుగుతుంది. దూరప్రయాణాలు. ఉద్యోగయత్నాలు డీలాపడతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బంది కలిగిస్తాయి.విద్యార్థునులకు ప్రేమ వ్యవహారాల్లో భంగపాటు త‌ప్ప‌దు. అనవసర ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి.

Related posts