telugu navyamedia
ట్రెండింగ్ రాశి ఫలాలు

అక్టోబర్ 29, గురువారం దినఫలాలు.. ఉద్యోగులకు శుభవార్త

మేషం : ఎదుటివారి కోసం బాగా శ్రమిస్తారు. స్త్రీల అవసరాలు, కోరికలు నెరవేరుతాయి. ఆస్తి వ్యవహార ఒప్పందాలకు మీ శ్రీమతి నుంచి అనుమతి లభిస్తుంది. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండాలి. మీ సంతానం విద్యా, ప్రయాణంపై శ్రద్ధ వహిస్తారు. చేపట్టిన పనులు, కార్యక్రమాలు, మార్పులుంటాయి.

వృషభం : వ్యాపారాల్లో ఒక నష్టాన్ని మరో విధంగా పూడ్చుకుంటారు. నిరుద్యోగుల ఉపాధి పథకాలకు స్పందన లభిస్తుంది. స్త్రీలకు అయినవారి ఆదరణ వస్త్రప్రాప్తి వంటి శుభపరిణామాలున్నాయి. వాహనచోదకులకు జరిమానాలు, చికాకులు తప్పవు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి.

మిథునం : ఆత్మీయుల సలహా పాటించి లబ్ధి పొందుతారు. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. ఉద్యోగస్తులు, అధికారులు మొహమ్మాటం, ధనప్రలోభాలకు దూరంగా ఉండాలి. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. ఉపాధ్యాయులకు ప్రశాంతత, నిశ్చింత నెలకొంటాయి. మీ యత్నాలు గోప్యంగా సాగించాలి.

కర్కాటకం : ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం. అమ్మవారిని కనకాంబరాలు, కలువలతో పూజించిన రుణవిముక్తి. ఆర్థిక పురోభివృద్ధి. చీటికి మాటికి ఎదుటివారిపై అసహనం ప్రదర్శిస్తారు. విద్యార్థులకు నిరుత్సాహం తప్పదు. ఉద్యోగయత్నం ఫలిస్తుంది. పత్రికా, వార్తా సిబ్బందికి యాజమాన్యం తీరు ఆందోళన కలిగిస్తుంది.

సింహం : సంతకాలు, చెల్లింపుల విషయంలో ఏకాగ్రత వహించండి. ఏదో సాధించలేకపోయామన్న భావం నిరుత్సాహం కలిగిస్తుంది. వ్యాపారాల్లో సామాన్య లాభాలే గడిస్తారు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ప్రియతముల కలయికతో మానసికంగా కుదుటపడతారు. నిరుద్యోగులకు ప్రకటనల పట్ల అవగాహన ముఖ్యం.

కన్య : మీ శ్రీమతి ప్రోత్సాహంతో ఒక శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. బంధువుల వ్యాఖ్యలు అనుక్షణం జ్ఞప్తికి వస్తాయి. ఖర్చులు అంతా లేకున్నా ఆర్థిక సంతృప్తి ఉండదు. పెట్టుబడులు, పొదుపు పథకాల దిశగా ఆలోచనలు ఉంటాయి. అనుకోని సంఘటనలు ఆందోళన కలిగిస్తాయి. ఏ పని ఉత్సాహంగా చేయలేరు.

తుల : ఉద్యోగస్తుల హోదా పెరిగే సూచనలు ఉన్నాయి. ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లలో పునరాలోచన అవసరం. మిత్రులు పరస్పరం కానుకలిచ్చిపుచ్చుకుంటారు. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోవాలి. ప్రయాణాలు, దైవదర్శనాలు సంతృప్తినిస్తాయి. కోర్టు వ్యాజ్యాలు, కేసులు ఉపసంహరించుకుంటారు.

వృశ్చికం : కుటుంబ ఆర్థిక విషయాలు కలవరపరుస్తాయి. భాగస్వామిక సమావేశాల్లో కొత్త విషయాలు చర్చకు వస్తాయి. దూర ప్రదేశంలో ఉన్న మీ సంతానం రాకకోసం ఎదురుచూస్తారు. పత్రికా సిబ్బందికి పనిభారం, ఒత్తిడి, చికాకులు వంటివి అధికమవుతాయి. ఇతరులను మీ వ్యక్తిగత విషయాలకు దూరంగా ఉంచండి.

ధనస్సు : చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. కొన్ని అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకోవలసి వస్తుంది. దైవదర్శనాల్లో అప్రమత్తంగా ఉండాలి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. మీ చెంత ధనం ఉందన్న విషయాన్ని గోప్యంగా ఉంచండి. ముఖ్యమైన వ్యవహారాలు స్వయంగా చూసుకోవడం మంచిది.

మకరం : ఆదాయ వ్యయాలకు చక్కని ప్రణాళికలు రూపొందించుకుంటారు. స్త్రీలకు టీవీ చానెళ్ల కార్యక్రమంలో అవకాశం లభిస్తుంది. దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. దూర ప్రాంతం నుంచి మీ సంతానం రాక సంతోషం కలిగిస్తుంది.

కుంభం : బ్యాంకు పనులు, కార్యకలాపాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపార వర్గాలకు పనివారలతో చికాకులు తప్పవు. విద్యార్థులకు క్యాంపస్ సెక్షన్‌లో నిరుత్సాహం తప్పదు. సంఘంలో మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. మిమ్మలను కలవరపరిచిన సంఘటన తేలికగా సమసిపోతుంది. ఖర్చులు పెరిగినా ఇబ్బంది ఉండదు.

మీనం : ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం అధికం. వ్యవహార ఒప్పందాల్లో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. సహోద్యోగుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఏజెన్సీలు, లీజు, గడువు పెంపులు అనుకూలిస్తాయి. ఆదాయానిక తగినట్టుగా ఖర్చులు తగ్గించుకుంటారు. స్త్రీల ఏమరుపాటువల్ల ఇబ్బందులు తప్పవు.

Related posts