వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు చంద్రబాబు పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూనే ఉంటారు. తాజాగా…విజయసాయిరెడ్డి మరోసారి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై తనదైన స్టైల్ లో కౌంటర్ ఇచ్చాడు. ఈసారి దుబ్బాక ఉపఎన్నిక దృష్టిలో పెట్టుకొని ట్వీట్ చేసారు. “తండ్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాలోకం ప్రధాన కార్యదర్శి. దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ పెట్టడానికి అభ్యర్థి దొరకలేదు. అక్కడ బిజెపి గెలిస్తే సొంత పార్టీ విజయం సాధించినట్టు మురిసి పోతున్నారు. ఇంకొకరి గెలుపును ఇలా పండుగ చేసుకోవడం దేశంలో ఎక్కడా చూడలేదు. వింతల్లోకెల్ల వింత ఇది.” అని పేర్కొన్నారు. అంతకుముందు ట్వీట్ లో “2 లక్షల మంది సన్న, చిన్నకారు రైతులకు ప్రభుత్వమే బోర్లు తవ్వించే ‘జలకళ’ స్కీం లాంటిది ఇంకే రాష్ట్రమైనా అమలు చేస్తుందేమో ఎవరైనా చూపించగలరా? మోటార్లు కూడా ఫ్రీగా అందజేసి 5 లక్షల ఎకరాలు సాగులోకి తెస్తామని సీఎం జగన్ గారు హామీ ఇచ్చారు. ఇది రైతు ప్రభుత్వం అనడానికి ఇంతకంటే ఏం కావాలి.” అంటూ ట్వీట్ చేశారు.
previous post