telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆస్కార్ 2020 : మూడు విభాగాల్లో ఆస్కార్ గెలుచుకున్న వార్ ఎపిక్ “1917”

1917

ప్రపంచ ప్రఖ్యాత అకాడెమీ ‘ఆస్కార్’ అవార్డుల ప్రధానోత్సవం లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకల్లో ‘1917’ సినిమా మూడు విభాగాల్లో (విజువల్‌ ఎఫెక్ట్‌, సౌండ్‌ మిక్సింగ్‌, సినిమాటోగ్రఫీ) అవార్డులను సొంతం చేసుకుంది. 92వ అకాడమీ అవార్డులకు ఈ సినిమా 10 నామినేషన్లు పొందడం విశేషం. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, ఆంబ్లిన్ పార్టనర్ సంస్థలు మొదటి ప్రపంచ యుద్ధం నేపథ్యంలో నిర్మించిన ‘1917’ చిత్రం ఇటీవల దేశవ్యాప్తంగా విడుదలైంది. సామ్ మెండెస్ (స్కై ఫాల్) ఫేమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ వార్ ఎపిక్ డ్రామా ఇప్పటికే పలు అవార్డులను గెలుచుకుంది. అలాగే బఫ్టా అవార్డ్స్‌కు ఈ సంవత్సరం 9 నామినేషన్లు పొందింది. అలాగే 77వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో ‘1917’ ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది. దర్శకుడు సామ్ ఉత్తమ దర్శకుడిగా అవార్డు గెలుచుకున్నారు. ఏకంగా ఏడు బాఫ్టా అవార్డ్స్ గెలుచుకుని సత్తా చాటిందీ చిత్రం ఇటీవల లండన్‌లో అంగరంగ వైభవంగా జరిగిన బ్రిటిష్ అకాడమి ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ పురస్కారాల ప్రధానోత్సవంలో ‘1917’ మూవీకి ‘బెస్ట్ ఫిల్మ్’, ‘అవుట్ స్టాండింగ్ బ్రిటిష్ ఫిల్మ్’, ‘డైరెక్టర్’, ‘సినిమాటోగ్రఫీ’, ‘ప్రొడక్షన్ డిజైనింగ్’, ‘సౌండ్’, ‘స్పెషల్ విజువల్ ఎఫెక్ట్స్’.. కేటగిరీల్లో అవార్డులు లభించాయి. ఇక 92వ ఆస్కార్ అవార్డ్ వేడుక‌లో ‘పారాసైట్‌’ చిత్రంతో పాటు ‘జోకర్‌’, ‘1917’ చిత్రాలు కూడా తమ హవాను చూపాయి. ‘జోకర్‌’ చిత్రానికి గాను హీరో జోక్విన్‌ ఫినిక్స్‌ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు.

Related posts