telugu navyamedia
క్రీడలు క్రైమ్ వార్తలు వార్తలు

కోహ్లీ నంబర్ వన్ ప్లేయర్..పాక్ క్రికెటర్ యూసుఫ్

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆటతీరుపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ యూసుఫ్ ప్రశంసలు కురిపించాడు. కోహ్లీ ఆట దృక్పథం గురించి చెప్పుకుంటూ పోతే ఎంతో ఉంటుంది. కోహ్లీ సాధించిన విజయాలు, బౌలర్లపై సాగించే ఆధిపత్యం న భూతో న భవిష్యతి అంటారన్నారు. తరానికి ఒక్కరు మాత్రమే జన్మించే ఇలాంటి ఆణిముత్యాల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే కోహ్లీ గొప్ప ఆటగాడని కితాబిచ్చాడు.

కోహ్లీకి గత తరం ఆటగాళ్లే కాదు, ఇప్పటి జట్టులోని పాక్ ఆటగాళ్లు కూడా అభిమానులేనంటే ఆశ్చర్యం కలిగిస్తుంది. కోహ్లీ 86 టెస్టుల్లో 53 సగటుతో 7,240 పరుగులు, వన్డేల్లో 248 మ్యాచ్ ల్లో 59 సగటుతో 11,867 పరుగులు సాధించాడు. టీ20ల్లోనూ కోహ్లీ సగటు 50కి తగ్గలేదంటే అతడి బ్యాట్ పవరేంటో అర్థమవుతుందని యూసుఫ్ పేర్కొన్నారు.

Related posts