telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

బండి సంజయ్ నీ అబద్ధపు మాటలు ఆపు…

మల్లు భట్టి విక్రమార్క… ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపై దుష్ప్రచారం చేసి లబ్ది పొందాలని బీజేపీ ప్రయత్నం చేస్తోంది. జానారెడ్డిలాంటి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పార్టీ మారుతున్నాడంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం . జానారెడ్డి లాంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులపై కూడా బీజేపీ ఇలాంటి కట్టు కథలను నాగార్జున సాగర్ ఎన్నికల సమయంలో చెబుతోంది.. దుబ్బాక ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి టీఆర్ఎస్ లో చేరుతున్నారంటూ తప్పుడు వీడియోను రిలీజ్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టించి ఓట్ల లబ్దిని బీజేపీ పొందింది. జానారెడ్డిగారు అత్యంత సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్నారు. ఉన్నత విలువలు, ఆదర్శప్రాయమైన రాజకీయాన్ని ఆయన కొనసాగిస్తున్న వ్యక్తి. జానారెడ్డి గారు ఎప్పుడూ కాంగ్రెస్ లోనే ఉంటారు.. ఆయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు.. అలాంటి వ్యక్తిపైన బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అత్యంత చౌకబారుగా ఉన్నాయి. జానారెడ్డిగారి గురించి తెలిసిన ఏ ఒక్కరు బండి సంజయ్ మాటలను విశ్వసించరు. పదేపదే మైక్ దొరికిందని మాట్లాడ్డం.. సవాళ్లు, ఛాలెంజులు విసరడం.. ఎన్నికలు అయ్యాక కేసీఆర్ తో చేతులు కలపడం సంజయ్ కు షరా మామూలే. దీనిని సాగర్ ప్రజలు గమనించాలని కోరుతున్నా.

బండి సంజయ్.. అసలు నువ్వు టీఆర్ఎస్ ఒక్కటే. రైతు చట్టాలను మీదట వ్యతిరేకించిన కేసీఆర్.. ఢిల్లీ వెళ్లి మీ ప్రధానమంత్రిని కలిసిన తరువాత ఒక కాంప్రమైజ్ కు వచ్చి యూ టర్న్ తీసుకున్నారు. టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్ కు రాకుండా మీరు.. అధికార పార్టీ కలిసి ఆడుతున్న రాజకీయ నాటకాన్ని ప్రజలు గుర్తించారు. ఈ ఉప ఎన్నికలో మీ ఇద్దరికి కలిపి ప్రజలు తగిన బుద్ది చెబుతారు.

కేటీఆర్ కు కళ్ళు నెత్తికెక్కి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎవడు అని ఏకవచనంతో మాట్లాడుతున్నాడు.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదే కాంగ్రెస్ పార్టీ కాళ్ళ ముందు పడి దేబిరించిన సంగతి కేటీఆర్ మరిచిపోయినట్లు ఉంది.. కేసీఆర్ ని తిడితే కేసులు పెడతామని అంటున్నావు.. అసలు తిట్ల సంస్కారం మొదలు పెట్టింది మీ అయ్య కే చంద్ర శేఖర్ రావే అన్న సంగతి నీకు గుర్తుందా కేటీఆర్.. బూతులు మాట్లాడ్డం, తిట్ల సంస్కారాన్ని రాష్ట్రంలోకి తీసుకువచ్చింది మీ అయ్య కే చంద్రశేఖర్ రావే.. రాష్ట్ర రాజకీయాలను బూతులతో బ్రష్టు పట్టించింది నువ్వూ.. మీ అయ్యనే. ఈ రోజు బూతులు గురించి, తిట్ల గురించి నువ్వు నీతులు చెబితే ఎలా?? యధారాజా.. తథాప్రజా అన్నట్లు మీ అయ్యా ఏది మాట్లాడుతున్నాడో మిగిలిన నాయకులు.. అదే మాట్లాడుతున్నారు.. ముందు నువ్వు మీ అయ్యను ఇలా మాట్లాడకు అని హెచ్చరించు.. అలాగే నువ్వు కూడా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు..

రాష్ట్రంలో ఎన్నికలు మీకు ఒక వ్యాపారంలా మారిపోయాయి. ఎక్కడ ఎన్నికలు అంటే అక్కడకు వెళ్లడం ఎవరిని ఎంతకు కొనాలి అని చూడడం మీకు మామూలుగా అయిపోయింది. అలాగే ఎన్నికలప్పుడే మీకు అభివృద్ధి ప్రకటనలు.. శంఖుస్థాపనలు.. లేనిపోని హామీలు..

ఎన్నికలు అనగమే మీకు ఆమె వ్యఓరం.. ఏ నికలడగర్కు పోవడం ఎవరికి ఎంతకు కొనాలని ప్రయటనలు.. లేనిపోని శంఖుస్థాపనలు చేయడం..ఎన్నికలు అయ్యాక వాటిని అక్కడితో వదిలేసి వెళ్లడం మీకు షరా మామూలుగా మారింది. ఇప్పుడు వరంగల్ లో చేస్తున్నది.. సాగర్ లో చెబుతున్న హామీలు మాటలు చెప్పడం అందులో అలాంటివే అన్నది అందరికి తెలుసు.

Related posts