telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కరోనా పాజిటివ్…’

Corona Virus Vaccine

దాదాపు ఏడాదికి పైగా కరోనా అందర్నీ అతలాకుతలం చేసింది. అయితే, కరోనా వ్యాక్సిన్ వచ్చిందని రిలాక్స్ కావడానికి లేదంటోంది కరోనా వైరస్… అంతెందుకు.. వ్యాక్సినేషన్‌ తీసుకున్న తర్వాత నిర్వహించిన పరీక్షల్లో ముద్దురు వైద్యులకు ఇప్పుడు కరోనా పాజిటివ్‌గా తేలడం కలకలం రేపుతోంది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని సిమ్లాలో.. వైద్యులకు కొవిషీల్డ్ వ్యాక్సిన్ ఇచ్చారు.. తొలి డోసుతీసుకున్న తర్వాత 10 రోజులకు వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. ముగ్గురు వైద్యులకు పాజిటివ్‌గా తేలింది. ఆ ముగ్గురిలో ఇద్ద‌రు దంప‌తులు కాగా.. మ‌రో డాక్ట‌ర్ ఉన్నాడు. దీంతో.. ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే, ఆ ముగ్గురు వైద్యులు ఇంకా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకోలేదని.. క‌రోనా ఇన్‌ఫెక్ష‌న్‌కు, వ్యాక్సినేష‌న్‌కు లింక్ చేయ‌డం లేద‌న్నారు ఐజీఎంసీ వైద్యుడు ర‌జ‌నీశ్ ప‌ఠానియా… వ్యాక్సినేష‌న్‌కు ముందే వైర‌స్ సోకి ఉండొచ్చుఅనే అనుమానాలను వ్యక్తం చేశారు. తొలి డోస్ వ్యాక్సిన్ తీసుకున్న త‌ర్వాత వారు రెగ్యుల‌ర్‌గా విధులు నిర్వ‌ర్తిస్తున్నార‌ని అధికార వ‌ర్గాలు తెలిపాయి. చూడాలి మరి ఇంకా ఏం జరుగుతుంది అనేది.

Related posts