telugu navyamedia
ట్రెండింగ్ రాశి ఫలాలు వార్తలు

ఏప్రిల్ 20 మంగళవారం దినఫలాలు

మేషం : ఆదాయ వ్యయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. విద్యార్థులకు ప్రేమ వ్యవహారాలు వికటిస్తాయి. ఉద్యోగ యత్నాలలో పురోగతి కనిపిస్తుంది. ఇతరులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. మీ అత్యుత్సాహం అనర్థాలకు దారితీస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి.

 

వృషభం : మీ పట్టుదలత, అంకితభావం ఇతరులకు మార్గదర్శకమవుతుంది. ప్లీడర్లకు తమ క్లయింట్ల తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకం. శత్రువులు మిత్రులుగా మారి సహకారాలు అందిస్తారు. ప్రముఖులను కలుసుకుని వారితో ఉల్లాసంగా గడుపుతారు.

 

మిథునం : స్త్రీలకు కళ్లు, తల నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. ఎదుటివారిని గమనించి తదనుగుణంగా సంభాషించండి. షాపింగ్‌లో దుబారా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రాజకీయాలలో వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది.

 

కర్కాటకం : వృత్తుల వారికి సదావకాశాలు లభించినా ఆర్థికంగా ఆశించినంత సంతృప్తి ఉండదు. ఏదైనా స్థిరాస్తి అమ్మకానికై చేయు యత్నాలు వాయిదా పడటం మంచిది. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో శ్రమించి సఫలీకృతులవుతారు. పెద్దల ఆరోగ్యం విషయంలో మెళకువ అవసరం.

 

సింహం : మీ అభిరుచికి తగిన వ్యక్తితో పరిచయాలేర్పడతాయి. బంధు మిత్రుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళకువ అవసరం. ఖర్చులు అధికమైనా ఆదాయానికి లోటు అంతగా ఉండదు. ధనియాలు, ఆవాలు, పసుపు, నూనె వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు అనుకూలంగా ఉండగలదు.

 

కన్య : మీ చిన్నారులకు ధనం అధికంగా వెచ్చిస్తారు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. విదేశీయానం కోసం చేసే యత్నాల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు. ఉన్నత విద్యల నిమిత్తం చేసే విదేశీయాన యత్నం ఫలిస్తుంది. స్త్రీల కళాత్మక, నైపుణ్యతకు మంచి గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తుంది.

 

తుల : కాంట్రాక్టర్లకు ప్రముఖుల సహకారంతో పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. బంధువులను కలుసుకుంటారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. ఖర్చులు పెరగడంతో అదనపు రాబడికై యత్నిస్తారు.

 

వృశ్చికం : పరిశోధనాత్మక విషయాలకై ఆసక్తి చూపుతారు. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల ఆసక్తి పెరుగుతుంది.

 

ధనస్సు : మీ శ్రీమతి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు. బ్యాంకు లావాదేవీలకు అనుకూలం. ఉద్యోగస్తులు సభలు, సమావేశాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తారు. విద్యుత్ రంగంలో వారికి పనిభారం అధికం. ఏవైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తినా తాత్కాలికమేనని గ్రహించండి.

 

మకరం : వస్త్ర వ్యాపారులకు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ఇతరులు మీ పట్ల ఆకర్షితులవుతారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి చికాకులను ఎదుర్కొంటారు. చేతి వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు సదావకాశాలు లభిస్తాయి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది.

 

కుంభం : ఏసీ, కూలర్ మెకానిక్ రంగాలలో వారికి సంతృప్తితో పాటు పనిభారం కూడా అధికమవుతుంది. మంచికిపోతే చెడు ఎదురయ్యే పరిస్థితులు ఎదుర్కొంటారు. మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి వస్తాయి. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. బంధువులతో తెగిపోయిన సంబంధాలు తిరిగి బలపడతాయి.

 

మీనం : ఇసుక, క్వారీ, కాంట్రాక్టర్లకు ఊహించని ఆటంకాలెదురవుతాయి. విద్యుత్ వస్తువుల పట్ల ఏకాగ్రత చూపుతారు. మార్కెటింగ్ రంగంలోని వారికి ఒత్తిడి, శ్రమాధిక్యత తప్పవు. పనులకు ఆటంకాలు కల్పించాలనుకున్నవారు సైతం అనుకూలంగా మారతారు. భాగస్వామిక వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

Related posts