మేషరాశి..
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. బంధువులతో విభేదాలు ఏర్పడతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. అనారోగ్యం బారిన పడతారు. వ్యాపారాలలో చిక్కులు ఏర్పడతాయి.బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.ఆలయాలు సందర్శిస్తారు.
వృషభరాశి..
బంధువులు నుంచి శుభవార్తలు వింటారు. ధన, వాహనయోగం కలుగుతుంది. సోదరులు సహాయం అందిస్తారు. నిరోద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఆర్థిక లాభాలు ఉంటాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది.
మిథునరాశి..
బెండి బాకీలు వసూలవుతాయి. సంఘంలో గౌరవం లభిస్తుంది. భూవివాదాలు తీరతాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవదర్శనం చేస్తారు.
కర్కాటకరాశి..
ముఖ్యమైన వ్యవహారాలలో చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. బండి నడేపే టప్పుడప్పుడుజాగ్రత్త హహించడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రుల నుంచి ఒత్తిడులు ఎక్కువవుతాయి. అనారోగ్యం సూచన. కుటుంబంలో సమస్యలు తలెత్తుతాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
సింహరాశి..
ఉద్యోగస్తులకు శ్రమ తప్పదు. బంధువులతో అకారణంగా విరోధాలు ఏర్పడతాయి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. దూరప్రయాణాలు చేస్తారు. దైవదర్శనాలు చేస్తారు. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పై అధికారులు నుంచి ఒత్తిడులు ఏర్పడతాయి.
కన్యరాశి..
అనుకున్న కార్యాలు దిగ్విజయంగా సాగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం మెరుగు పడుతుంది. బంధువులు నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగస్తులకు శ్రమ తప్పదు.
విద్యార్ధులకు శ్రమిస్తే విజయం సొంతం అవుతుంది.
తులరాశి..
కుటుంబంలో కొత్త సమస్యలు తలేత్తుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. ప్రయాణాలలో మార్పులు ఏర్పడతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార విస్తరణ నిలిచిపోతుంది. ఉద్యోగాలలో నిరుత్సాహం తప్పదు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
వృశ్చికరాశి..
పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రుల కలుసుకుంటారు. విందువినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగస్తులకు అవకాశాలు పెరుగుతాయి.
ధనుస్సురాశి..
అప్పులువారి నుంచి ఒత్తిడులు ఏర్పడతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. మిత్రులతో కలహాలు ఏర్పడతాయి. అనారోగ్యం బారిన పడతారు. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో కొత్త చిక్కులు ఏర్పడతాయి. వ్యాపారాలు పంజుకుంటాయి.
మకరరాశి..
ఉద్యోగస్తులు ఉన్నత స్థాయికి వెలతారు. వ్యాపారాలు లాభిస్తాయి.ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉంటాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆలయ దర్శనాలు చేస్తారు. కుటుంబసభ్యులతో విభేదాలు ఏర్పడతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు.
కుంభరాశి..
కుటుంబసభ్యులు నుంచి సాయం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. కొత్త పనులు చేపడతారు. వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. ఉద్యోగస్తులకు శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. ఆర్థికంగా బాగుంటుంది. బందువులతో సరదాగా గడుపుతారు.
మీనరాశి..
అనుకోని ప్రయాణాలు చేస్తారు. ఆస్తుల వివాదాలు కొలక్కివస్తాయి. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు ఏర్పడతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పనుల్లో అవాంతరాలు ఏర్పడతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఆలయాలు సందర్శిస్తారు.