telugu navyamedia
రాశి ఫలాలు

నవంబర్ 9, మంగళవారం రాశిఫలాలు

మేష రాశి..

మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. ముఖ్యమైన విషయాలలో ఆలోచించి అడుగులు వేయడం మంచిది. వ్యాపారాలలో జాగ్రత్తలు తప్పనిసరి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది.చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు.

వృషభ రాశి..

స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో ఏకాగ్రత అవసరం. ధనవ్యయంలో మితంగా వ్యవహరించండి. చేపట్టిన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఓ విషయం మిమ్మల్ని ఆనందం కలిగిస్తుంది. బంధుమిత్రులతో చేపట్టిన పనులలో మంచి ఫలితాలు లభిస్తాయి. వ్యాపారులకు ఒత్తిళ్లు ఏక్కువవుతాయి. ఉద్యోగులకు బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.

మిథున రాశి..

అవసరానికి తగిన సహాయం అందుకుంటారు. ఆలయాలను సందర్శిస్తారు. ఖర్చులు అదుపు చేయాలన్న మీ యత్నం ఫలించదు. బంధుమిత్రుల సూచనలు, సలహాలు పాటించడం మంచిది. అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులకు ఊహించని పెట్టుబడులు. ఉద్యోగులకు ఉన్నతస్థితి క‌లుగుతుంది.

కర్కాటక రాశి..

మీమీ రంగాలలో మంచి లాభాలు పొందుతారు. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించటం మంచిది కాదని గమనించండి. కుటుంబీకుల మధ్య పలు విషయాలు చర్చకు వస్తాయి. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఉద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ప్రముఖులను కలుసుకుంటారు. వ్యాపారులకు పెట్టుబడులు సమకూరతాయి.

సింహ రాశి..

శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. కొన్ని వ్యవహారాలలో ఆర్థిక లాభాలు పొందుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. బంధువులను కలుసుకుంటారు. దీర్ఘకాలికంగా వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తవుతాయి. కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం బారిన ప‌డ‌తారు.

కన్య రాశి..

చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆర్థిక విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. దంపతుల మధ్య ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగస్తుల సమర్థత వల్ల అధికారులు, సహోద్యోగులు లబ్ధి పొందుతారు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు ఎక్కువ‌వుతాయి. .

తుల రాశి..

పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. మానసిక ఆందోళన కలుగుతుంది. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. వ్యాపారాలలో లాభాలు దక్కే ఛాన్స్ ఉంటుంది.

వృశ్చిక రాశి..

కొన్ని కొన్ని సమస్యలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వ్యాపారాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. స్త్రీలకు కళ్ళు, తల, నరాలకు సంబంధించిన చికాకులు తప్పవు. కొత్త ప్రాజెక్టులు చేపడతారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. స్వల్ప అనారోగ్యానికి గురైవుతారు.

ధనుస్సు రాశి..

చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. శతృవులపై విజయం సాధిస్తారు. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగుటుంది. ఇతరులకు పెద్దమొత్తంలో ధనసహాయం చేసే విషయంలో పునరాలోచన మంచిది. వ్యాపారాలలో లాభాలు వ‌స్తాయి.

మకర రాశి..

చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా ధైర్యంతో అధిగమిస్తారు. ఇతరులతో జాగ్రత్తగా వ్య‌వ‌హారించాలి. మీపై నిందలు వేసే అవకాశం ఉంది. స్త్రీలకు ఆహార, ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. పనులలో అవాంతరాలు ఏర్ప‌డ‌తాయి. వ్యాపారాలలో చిక్కులు ఏదుర‌వుతాయి.

కుంభ రాశి..

మీ కుటుంబీకుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది . చేపట్టే పనులలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. బంధు,మిత్రుల సూచనలు, సలహాలు పాటించాలి. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది.

మీన రాశి..

బ్యాంకింగ్ వ్యవహారాలలో మెలకువ వహించండి. దంపతుల మధ్య దాపరికం మంచిది కాదని గమనించండి. ఓ వ్యవహారంలో సమయానికి డబ్బులు చేతికి అందుతారు. వివిధ వ్యాపారాలలో పెట్టుబడులు పెడతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. నూతన పరిచయాలు ఏర్ప‌డ‌తాయి.

Related posts