telugu navyamedia
రాశి ఫలాలు

నవంబర్ 23, మంగళవారం, రాశిఫలాలు

మేష రాశి..

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలకు పరిస్థితులు అనుకూలంగా ఉంటుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. గో సేవ చేయడం వల్ల మంచి జరుగుతుంది. వాహనయోగం క‌లుగుతుంది. పనులలో ఆటంకాలు తొలగుతాయి.  స్త్రీల అతిథి మర్యాదలకు తగిన గుర్తింపు లభిస్తుంది.

వృషభ రాశి..

చేపట్టే పనులకు ఆటంకాలు కలుగకుండా చూసుకోవాలి. గిట్టనివారితో జాగ్రత్తగా ఉండటం మంచిది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. దూరప్రయాణాలు, దైవదర్శనాలు చేస్తారు. శ్రమాధిక్యం, వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందికరంగా ఉంటాయి.

మిథున రాశి..

చేపట్టే పనులలో పురోగతి లభిస్తుంది. ప్రయాణాలలో జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగులకు మంచి అవకాశాలు. సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు. పుణ్యక్షేత్ర సందర్శనలకు అనుకూలం. నిరుద్యోగులకు ప్రకటనల పట్ల అవగాహన ముఖ్యం.

కర్కాటక రాశి..

శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. చేపట్టే పనులలో ఆలోచంచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. ప్రైవేట్ ఫైనాన్సుల్లో మదుపు, వ్యక్తులకు రుణం ఇవ్వటం వాయిదా వేయడం మంచిదికాదు.

సింహరాశి..

ఆశించిన ఫలితాలు ఉంటాయి. దూర ప్రాంతాల నుంచి శుభ వార్త అందుకుంటారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. ఇతరులు చేసిన తప్పిదాలకు సైతం మీరే బాధ్యత వహించవలసి వస్తుంది. ప‌నులు సకాలంలో పూర్తి చేస్తారు.

కన్య రాశి..

వృత్తి, వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు. చేపట్టే పనులన్ని విజయవంతం అవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దక్కే అవకాశం ఉంటుంది. రాజకీయ రంగాలలో వారికి ఒత్తిడి పెరుగుతుంది. వ్యవసాయ, తోటల రంగాల వారికి ఆందోళన తప్పదు.

వృశ్చిక రాశి..

కొన్ని పనులు చేపట్టే ముందు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. నిత్యావసర వస్తువులకు, స్టాకిస్టులకు గుప్త విరోధులు అధికం అవుతున్నారని గమనించండి. కొన్ని పనులు వాయిదా వేస్తారు. నూతన వ్యక్తుల పరిచయం మీకెంతో సంతృప్తినిస్తుంది.

ధనుస్సు రాశి..

మానసిక ఆనందాన్ని పొందుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఒక శుభవార్తను అందుకుంటారు. ఉద్యోగంలో మంచి పేరు సంపాదించుకుంటారు. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది.

మకర రాశి..

కంప్యూటర్, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రులతో ప్రేమగా వ్యవహరించాలి. ధైర్యంతో ముందుకెళితే మంచి అవకాశాలు ఉంటాయి. కుటుంబంలో సంతోషక‌ర‌వాతావ‌ర‌ణం ఉంటుంది.

కుంభ రాశి..

మనసు పెట్టి పనులను చేపడితే మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ముఖ్యం. ప్రయాణాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. పారిశ్రామిక వేత్తలు, ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు ఆక్షేపణలు ఎదుర‌వుతాయి.ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబంలో సమస్యలు ఎక్కువవుతాయి.

మీన రాశి..

వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. కొన్ని విషయాలు మిమ్మల్ని నిరుత్సాహ పరుస్తాయి. కొన్ని పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. అవనసరమైన ఖర్చులు పెరుగుతాయి.దైవదర్శనాలు చేస్తారు.

 

 

Related posts