telugu navyamedia
తెలంగాణ వార్తలు

హైద‌రాబాద్‌ ను భారీ వర్షాలు ముంచెత్తుతాయట..

హైద‌రాబాద్‌ లో 27, 28, 29 తేదీల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగర పాలక సంస్థ అత్యవసర శాఖలకు పలుసూచనలు చేస్తూ హెచ్చరికలు జారీ చేసింది. మూడు రోజుల పాటు నగరాన్ని వర్షాలు ముంచెత్తనున్నట్టు తెలియడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.

Cyclone Gulab: Hyderabad on high alert; very heavy rain next 48-hours in Telangana

లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ మొదలైనట్టు తెలుస్తుంది . అలాగే నాలాల పై నివసించేవారిని కూడా అప్రమత్తం చేస్తున్నట్టు తెలుస్తుంది .హైదరాబాద్ లో ఒక మోస్తరు వర్షాలు పడితేనే ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుంది . లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఇబ్బందులు పడుతుంటారు . ఇళ్లలోకి నీరు ప్రవేశించి బిక్కు బిక్కుమంటూ గడుపుతుంటారు.

Heavy rain alert for Hyderabad till Oct 15

ఎప్పుడు భారీ వర్షాలు కురిసినా ప్రభుత్వం తాత్కాలిక ఏర్పాట్లు చేయడం తప్ప శాశ్వత పరిష్కారం గురించి ఆలోచించడు.నాలాలపై వున్న అక్రమ నిర్మాణాలు తొలగిస్తామని ప్రకటనలు చేస్తుందే తప్ప ఆచరణలో పెట్టాడు . లోతట్టు ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం జరగకుండా కూడా జాగ్రత్తలు తీసుకోదు.

Hyderabad residents search at collection points for documents washed away in floods

ఉస్మాన్ ,సాగర్ , గండిపేట ప్రాంతాల్లోని పరివాహక ప్రాంతాల్లో అక్రమ కడ్డదాలు వస్తూనే వున్నాయి . వాటిపై దృష్టి పెట్టాడు . అందుకే హైదెరాబాదులో ఎప్పుడు భారీ వర్షాలు పడ్డా ప్రజలు వూహించనత ఇబ్బందులు పడుతుంటారు .ఈ సమస్యలకు సరైన పరిష్కారాలు లభించకపోడానికి కారణం ఓటు బ్యాంకు రాజకీయాలే.

Related posts