ఈ మధ్యే తెరాస నేత నాయిని నర్సింహా రెడ్డి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారన్న సంగతి తెలిసిందే. సరిగ్గా నాలుగు రోజుల క్రితం ఆయన మరణించారు. వారం రోజుల క్రితం ఊపిరితిత్తుల సమస్యలతో ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ మరణించినట్లు అపోలో ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. అయితే ఆయన అంత్యక్రియల సమయంలో కూడా అనారోగ్యంతో అపోలోలో చికిత్స పొందుతున్న ఆయన భార్య అహల్య తన భర్తను చూసేందుకు వీల్ ఛైర్ లో వచ్చారు. భర్తను కడసారి చూసేందుకు హాస్పిటల్ నుండి మినిస్టర్ క్వార్టర్స్ కు ప్రత్యేక అంబులెన్స్ లో ఆమెను తీసుకువచ్చారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె భర్త ఇక లేడన్న విషయాన్ని తట్టుకోలేకపోయింది. దీంతో కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆ సమయంలో ఆ ఘటన చూపరులకు కంట తడి పెట్టించింది. అయితే తాజాగా ఆమె కూడా కన్ను మూశారు. కొద్ది సేపటి క్రితం ఆమె అపోలోలో చికిత్స పొందుతూ ఆమె మరణించారు.
రైతు బంధు ఎన్నికల బందుగా మారింది: రేవంత్రెడ్డి