telugu navyamedia
తెలంగాణ వార్తలు

నేడు మునుగోడులో సీఎం కేసీఆర్ ప్రజాదీవెన సభ.. అభ్యర్థి ప్రకటన

నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని  ఉప ఎన్నిక నేప‌థ్యంలో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు.ప్రజాదీవెన పేరుతో భారీ బహిరంగ సభను ఇవాళ నిర్వహిస్తోంది. 

మునుగోడు ఉపఎన్నికకు షెడ్యూల్ రాకపోయినా పార్టీలు ప్రచారం మొదలు పెట్టేశాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా ప్రజలను కలుస్తున్నాయి. ఆయా పార్టీల అగ్రనేతలు మునుగోడులో సభలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

మునుగోడులో టీఆర్‌ఎస్ ఓ అడుగు ముందే నిలిచింది . ఈ సభతో తమ సత్తా చాటాలను గులాబీ దళం గట్టిగానే భావిస్తోంది.

ఈ క్ర‌మంలో ప్రజాదీవెన పేరుతో భారీ బహిరంగ సభను ఇవాళ నిర్వహిస్తోంది. ఈ  ప్రజా దీవెన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. 

సుమారు లక్ష మందికి పైగా జనాలు వస్తారనే అంచనా నేపథ్యంలో మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో గత పది రోజులుగా టీఆర్ ఎస్ శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశాయి.

మునుగోడులో టీఆర్ఎస్ ప్రజా దీవెన సభకు మంత్రులు, నేతలు తరలివెళ్తున్నారు. ఈ క్రమంలో నగరంలోని నెక్లెస్ రోడ్ నుండి భారీ ర్యాలీ‌తో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మేయర్ గద్వాల విజయ లక్ష్మీ మునుగోడుకు బయలుదేశారు.

అంతేకాకుండా మునుగోడులో జరిగే ప్రజాదీవెన సభలో ఆయన అభ్యర్థిని ప్రకటించే అవకాశముంది.మునుగోడు ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైన విష‌యం తెలిసిందే.

Related posts