telugu navyamedia
సినిమా వార్తలు

చాలా కాలానికి నన్ను మెల్లగా లాగావ్‌…

సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్‌ ప్రీ రిలీజ్‌ కార్య‌క్ర‌మంలో సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ చేసిన వ్యాఖ్య‌లు అటు ఏపీలో ఇటు ఫిలిం ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం టికెట్లను అమ్ముకోవటం ఏంటని గళమెత్తారు పవన్ కళ్యాణ్. ఇండస్ట్రీలోని మిగితా హీరోలంతా ఏకమై ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలని వ్యతిరేకించాలని టాలీవుడ్ లో పలువురు హీరోల‌కు అన్నారు.

సాయి ధరమ్ తేజ్ ప్రమాదం: మీడియాపై పవర్ పంచ్ లు, వైఎస్ జగన్ టార్గెట్ | Sai Dharam Tej accident: Pawan Kalyan power punches, targets YS Jagan

‘‘వైకాపా వాళ్లు థియేటర్‌లు మూసి వేస్తున్నప్పుడు మోహన్‌బాబుగారు కూడా మాట్లాడాలి. ఎందుకంటే ‘వైఎస్‌ కుటుంబీకులు మా బంధువులు’ అని మీరు చెబుతుంటారు కదా! నేను విన్నాను. చిత్ర పరిశ్రమను హింసించొద్దని వారికి చెప్పండి. కావాలంటే ‘పవన్‌కల్యాణ్‌ను బ్యాన్‌ చేసుకోండి. అతను, మీరూ తేల్చుకోండి’ అని చెప్పండి. మీరు పార్లమెంట్‌ మాజీ సభ్యులు. మాట్లాడాల్సిన నైతిక బాధ్యత మీకు ఉంది. ఈరోజు చిత్ర పరిశ్రమకు పెట్టిన నియమ, నిబంధనలు రేపు మీ విద్యానికేతన్‌కు కూడా పెట్టొచ్చు. కేవలం మోహన్‌బాబుగారికే కాదు, ప్రతి ఒక్కరికీ ఈ విషయం చెబుతున్నా’’ అని పవన్‌కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై సీనియర్‌ నటుడు మోహన్‌బాబు స్పందించారు..

Four men arrested for trespassing into Telugu actor Mohan Babu's farmhouse | The News Minute

‘నా చిరకాల మిత్రుని సోదరుడైన పవన్‌కల్యాణ్‌ నువ్వు నాకంటే చిన్నవాడివి అందుకని ఏకవచనంతో సంభోదించాను. పవన్‌కల్యాణ్‌గారు అనడంలో కూడా తప్పేమీలేదు. చాలా కాలానికి నన్ను మెల్లగా లాగావ్‌. సంతోషమే. ఇప్పుడు ‘మా’ ఎలక్షన్స్‌ జరుగుతున్నాయి. నా కుమారుడు విష్ణు మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌గా నిలబడ్డాడన్న సంగతి మీకు తెలిసిందే. అక్టోబరు 10వ తేదీన ఎలక్షన్స్‌ అయిపోతాయి. ఆ తర్వాత నువ్వు అడిగిన ప్రతిమాటకీ నేను హృదయపూర్వకంగా సమాధానం చెబుతాను. ఈలోగా నువ్వు చేయవలసిన ముఖ్యమైన పని.. నీ అమూల్యమైన ఓటును నీ సోదర సమానుడైన విష్ణుబాబుకి అతని ప్యానల్‌కి వేసి వాళ్లని గెలిపించాలని కోరుకుంటున్నా. థ్యాంక్యూ వెరీ మచ్‌.. మోహన్‌బాబు’ అని ట్వీట్‌ చేశారు.

Related posts