telugu navyamedia
రాశి ఫలాలు

సెప్టెంబర్ 5(ఆదివారం) రాశి ఫలాలు

మేషం : చిన్నతరహా, కుటీర పరిశ్రమలు, చిరు వ్యాపారులకు అనుకూలం. తలపెట్టిన పనులు శ్రమ మీద పూర్తి అవుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది.

వృషభం : వాణిజ్య ఒప్పందాలు అనుకూలిస్తాయి. మీ యత్నాలకు సన్నిహితులు అన్ని విధాలా సహకారం అందిస్తారు. కాంట్రాక్టర్లు పెద్ద కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

మిథునం : దైవ, పుణ్యకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృత్తి నిపుణులకు అనుకూల సమయం. ఆరోగ్యం బాగుంటుంది.

కర్కాటకం : నూతన పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించండి. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు ఉల్లాసంగా గడుపుతారు.

సింహం : అనుకూలమైన సమయం. ఆర్థికంగా ఎదగాలనే మీ ఆశయం ఫలిస్తుంది. చేపట్టిన పనులు కొంత ఆలస్యంగానైనా సంతృప్తికరంగా పూర్తిచేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది.

కన్య : వ్యాపార, ఆర్థికాభివృద్ధికి చేయు కృషిలో మార్పులు కనిపిస్తాయి. ఆదాయం బాగుంటుంది. ఆధ్యాత్మిక చింతన అధికమవుతుంది.నిరుద్యోగులకు ఉద్యోగాలకు సంబంధించి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. వృత్తి నిపుణులకు బాగుంటుంది.

తుల : వ్యాపారులకు బాగుంటుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృత్తి నిపుణులకు, చిన్న వ్యాపారులకు అనుకూల సమయం.

వృశ్చికం : ఉద్యోగస్తుల సమర్థత, ప్రతిభకు అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయం, ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగంలో ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.

ధనస్సు : ఆరోగ్యం జాగ్రత్త. ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్, రాజకీయాలు, సామాజిక సేవా రంగాలవారికి సమయం అనుకూలం.

మకరం : తీర్థయాత్రలు, విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. నిరుద్యోగులకు అనుకూలం. ఇంజనీర్లకు, ఐ.టి నిపుణులకు, న్యాయవాదులకు అన్ని విధాలా బాగుంటుంది.

కుంభం : ఆర్థిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది. ఖర్చులు తగ్గించుకోండి. వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి. శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. నిరుద్యోగులలో నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.

మీనం : తలచిన పనులు పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభించవచ్చు. వ్యాపార, స్వయం ఉపాధి, న్యాయ, పోలీస్, మిలిటరీ రంగం వారికి అనుకూలం. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు.

Related posts