telugu navyamedia
రాశి ఫలాలు

నవంబర్ 14 ఆదివారం రాశి ఫలాలు ..

మేష రాశి..

ఇతరులకు ఉచిత సలహా ఇవ్వటం వల్ల మాటపడక తప్పదు. చేపట్టిన పనులను పూర్తిచేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆద్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆస్తివివాదాలను పరిష్కరించుకుంటారు. అనుకోని ఖర్చులు పెరుగుతాయి.బంధు, మిత్రుల రాకపోకలు అధికమవుతాయి.

వృషభ రాశి..

పాతమిత్రుల కలయికతో మీకెంతో సంతృప్తినిస్తుంది. ట్రాన్స్‌పోర్ట్, ఆటోమొబైల్, రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. అప్పు సమస్యలు తగ్గిపోతాయి. వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. వాహనయోగం క‌లుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

మిథున రాశి..

ప‌నికిరాని గొడవలు దూరంగా ఉండటం మంచిది. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచనలు చేయాల్సి ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర‌వుతాయి. దూరప్రయాణాలు చేస్తారు. దైవదర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎత్తు ప‌ల్లాలు ఉంటాయి.

కర్కాటక రాశి..

అనుకున్న పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. పిల్లల పట్ల జాగ్రత్త వ‌హించ‌డం మంచిది. కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉంటారు. ప్రయాణాలలో అపరిచితుల పట్ల మెలకువ వహించండి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఆలోచనాత్మక నిర్ణయాలు తీసుకుంటారు. అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి.

సింహ రాశి..

స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. కొన్ని సమస్యలు చిన్నావే అయిన మనశ్శాంతి దూరం చేస్తాయి పాత మిత్రుల కలయికతో మీకెంతో సంతృప్తినిస్తుంది. బంధుమిత్రులను కలుసుకుంటారు. కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి. ఖర్చులు ఎక్కువ చేస్తారు..సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

కన్య రాశి..

చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. దైవ సేవాకార్యక్రమాల్లో ఏకాగ్రత వహిస్తారు. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. ఆస్తి వివాదంలో ఆటంకాలు ఉండవు. ఆకస్మిక ప్రయణాలు చేస్తారు. కుటుంబంలో గొడవలు జరుగుతాయి. జాగ్రత్తగా ఉండాలి.గృహయోగం. ఉద్యోగాలు దక్కుతాయి.

తుల రాశి..

ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక, సాంఘిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కుటుంబంలో కలతలు ఏర్పడతాయి. బంధుమిత్రులతో కలహాలు ఏర్పడతాయి. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. చేపట్టిన పనులు ముగించలేరు.

వృశ్చిక రాశి..

కుటుంబసభ్యుల మద్దతు లభిస్తుంది. ఆగిపోయిన పనులను పూర్తిచేస్తారు. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. స్నేహ బృందాలు అధికమవుతాయి. అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి.వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

ధనస్సు రాశి..

వీరు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన మిత్రుల సహకారం వల్ల సమసిపోగలవు. విదేశాలు వెళ్ళాలనే మీ కోరిక త్వరలోనే నెరవేరబోతోంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆలోచనాత్మక నిర్ణయాలు తీసుకుటుంటారు. అనుకున్న పనులను పూర్తిచేస్తారు. అనుకోని శుభవార్తలు వింటారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

మకర రాశి..

వారసత్వ పువ్యవహారాలలో చికాకులు తప్పవు. వాహనచోదకులకు చికాకులు అధికమవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. ఆస్తి వివాదాలు మరింత పెరుగుతాయి. మానసికంగా ఆందోళన చెందుతారు. చేపట్టిన పనులను మధ్యలోనే ఆపివేస్తారు. ఖర్చులు అధిక‌మ‌వుతాయి

కుంభ రాశి..

నిరుద్యోగులకు దూర ప్రాంతాలనుండి సదావకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు, ఉధ్యోగాలలో ఊహించని మార్పులు క‌నిపిస్తాయి. ఇతరుల మాటలను నమ్మి మోసపోయే అవకాశం ఉంటుంది. మానసికంగా ఆందోళన చెందుతారు. చేపట్టిన పనులు పూర్తి కావు. ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి.

మీన రాశి..

పెద్ద హోదాలో ఉన్న వారికి అధికారిక పర్యటనలు అధికమవుతాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు కలుగుతాయి. శత్రువులు పెరుగుతారు. శుభవార్తలు వింటారు. సంఘంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. కుటుంబంలో సమస్యలు పెరుగుతాయి. ఖర్చులు చేస్తారు.

Related posts