సోషల్‌మీడియా వాడకం పెరిగినప్పటి నుంచి రూమర్స్ కూడా పెరిగాయి. ముఖ్యంగా సెలబ్రెటీలను ట్రోలింగ్ చేయటం పెద్ద సమస్యగా తయారైంది. టాలీవుడ్ లో మంచు మోహన్ బాబు రెండవ వారసుడు మనోజ్ ని సోషల్ మీడియాలో నెటిజన్స్ టార్గెట్ చేశారు. కెరీర్ లో హిట్స్ లేవు, ఫ్యూచర్ లో సినిమాలేంటో తెలియదు, ఎప్పుడు స్టార్ట్ అవుతాయో, ఎప్పుడు విడుదలవుతాయో.. అంటూ నెగిటీవ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరోవైపు మనోజ్ స్క్రీన్‌పై కనిపించి చాలాకాలం కావడంతో ఆయన సినిమాలు మానేస్తున్నారు అంటూ కొందరు తప్పుడు వార్తలు రాశారు.
దీనిపై మనోజ్ స్పందిస్తూ..తనని పర్సనల్ గా టార్గెట్ చేసిన వారిపై చాలా కూల్ గా తనదైన శైలిలో కామెడీ చేస్తూ బ్రహ్మానందం ఫోటోలని పెట్టి నెటిజన్స్ కి కౌంటర్స్ ఇచ్చాడు మంచు మనోజ్. ‘అన్నో.. ఇలాంటి తప్పుడు వార్తలు పోస్ట్ చేయకండి. సమ్మర్ నుంచి మన సినిమా స్టార్టు.. యాక్షన్ అని చెప్పకముందే కట్ చెప్పొద్దూ అన్న. ఏదైమైనా ఐ లవ్ యూ అన్న.. నీ నెక్ట్స్ ఆర్టికల్ కి నా బెస్ట్ విషెస్’ అంటూ బ్రహ్మానందం దండం పెడుతున్న ఫోటోలతో మంచు మనోజ్ ట్వీట్ చేశారు. ఇక మంచు మనోజ్ దిమ్మతిరిగే రెస్పాన్స్ ఇవ్వటంతో ఆ సదురు వార్తా సంస్థ రెస్పాన్స్ అయింది. జరిగిన తప్పు తెలుసుకుని మరో వార్తని ప్రచురించింది. దీనికి సమాధానం ఇస్తూ మరో బ్రహ్మానందం ఫోటోని ట్వీట్ చేశాడు మంచు మనోజ్.
కాగా.. మంచు మనోజ్ 2004 ఆగస్టు 6న ‘దొంగ దొంగది’ మూవీతో టాలీవుడ్ లో డ్యాషింగ్ ఎంట్రీ ఇచ్చాడు. తండ్రికి తగ్గ డైలాగ్ డెలివరీ, ఎనర్జీ, డ్యాన్సింగ్ స్కిల్స్, రిస్కీ ఫైట్స్ చేయటం వంటి పాజిటీవ్ అంశాలు మంచు మనోజ్ లో ఎన్నో ఉంటాయి. ప్యూర్ కమర్షియల్ సినిమాల కంటే కథ బలమున్న సినిమాలనే ఎంచుకుంటూ కెరీర్ లో ఎన్నో రిస్కీ డెసిషన్ తీసుకున్నాడు. అయితే నటుడిగా ఎప్పటికప్పుడు క్రేజ్ ని పెంచుకుంటూ వెళ్లిన మంచు మనోజ్ కెరీర్ లో మాత్రం ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్కటి కూడా సరైన హిట్ లేదు..
ఇటువైపు చూస్తే.. పర్సనల్ లైఫ్ లోను ఒడిదుడుకులే ఎదురైయ్యాయి. రీసెంట్ గా ప్రేమించి పెళ్లాడిన భార్యతో మనస్పర్థాలు కారణంగా విడాకులు తీసుకున్నాడు మనోజ్.