telugu navyamedia
రాశి ఫలాలు

న‌వంబ‌ర్ 5, శుక్రవారం రాశిఫ‌లాలు…

మేషరాశి..
విందు, వినోదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ఆప్తుల నుంచి పిలుపు అందుతుంది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంది. మానసిక ఆందోళనతో ఉంటారు. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ప్రతి చిన్న విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వాహనయోగం క‌లుగుతుంది.

వృషభరాశి..
బంధువులు నుంచి శుభవార్తాలు వింటారు..మీ కోపాన్ని అదుపులో పెట్టుకుంటే మంచి జరుగుతుంది.. మానసిక ఆందోళనను తొలగించడానికి దైవధ్యానం అవసరం. శారీరక అనారోగ్యంతో బాధపడతారు. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉండవు. వృధా ప్రయాణాలు ఎక్కువవుతాయి.వాహనాలు, ఆభరణాలు కొంటారు.

మిథునరాశి..
ప్రయాణాలు వాయిదా ప‌డ‌తాయి. శ్రమాధిక్యం. ముఖ్య‌మైన వ్యవహారాలలో అవాంతరాలు ఏర్ప‌డ‌తాయి.
సన్నిహితులతో మాటపట్టింపులు ఎక్కువ‌వుతాయి. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. మానసిక చంచలంతో ఇబ్బంది పడటారు. సోమరితనం ఆవహిస్తుంది. పిల్లలపట్ల మిక్కిలి జాగ్రత్త వహిస్తారు. కొన్ని మంచి అవకాశాలను కోల్పోతారు.

కర్కాటకరాశి..
ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ‌వుతాయి. దూరప్రయాణాలు చేస్తారు. రాజకీయ వ్యవహారాల్లో విజయాన్ని సాధిస్తారు.. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇతరులకు ఉపకరించే పనులు చేపడతారు. గౌరవ మర్యాదలు లభిస్తాయి.పాతమిత్రుల కలయిక.

సింహ రాశి..
భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగండి. తోటివారిని కలుపుకొని పోవడం వల్ల పనులు త్వరగా పూర్తవుతాయి. ఆదాయానికి తగినట్టు ఖర్చులు ఉంటాయి. గృహంలో మార్పులు జరిగే అవకాశాలున్నాయి. తలచిన కార్యాలు ఆలస్యంగా నెరవేరుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి ఉంటుంది.

కన్యరాశి..
మనస్సు చంచలంగా ఉండే అవకాశం ఉంది..కుటుంబసభ్యులతో విభేదాలు ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. అకాల భోజనం వల్ల అనారోగ్య బాధలను అనుభవిస్తారు. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు పరిష్కారం అవుతాయి.

తులరాశి..
సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పనులు సజావుగా సాగుతాయి. దైవదర్శనాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం ఉంటుంది. మానసిక ఆందోళనలు తొలగిపోతాయి.. ఆరోగ్యం గురించి జాగ్రత్తవహించాలి. ఆకస్మిక భయం దూరమవుతుంది. ప్రయాణాల్లో మెలకువ అవసరం. ప్రయత్న కార్యాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి.

వృశ్చికరాశి..
అనారోగ్యం భారిన ప‌డ‌తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు ఎదుర‌వుతాయి. విదేశయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం ఎంతో మేలు చేస్తుంది.

ధనుస్సురాశి..
కుటుంబ కలహాలు, ఇతర విషయాలు దూరమవుతాయి. నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం ల‌భిస్తుంది. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. వృథా ప్రయాణాల వల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి.

మకరరాశి..
ఆప్తుల సలహాలు పాటిస్తారు. సంఘంలో గౌరవం.ఒకటి కోరుకుంటే మరొకటి జరుగుతుంది.. అనారోగ్య బాధలు స్వల్పంగా ఇబ్బంది పెడతాయి.. వేళ ప్రకారం భుజించడానికి ప్రాధాన్యమిస్తారు. మనో నిగ్రహానికి ప్రయత్నించాలి. పిల్లలపట్ల మరింత శ్రద్ద వహించడం మంచిది.బాకీలు వసూలవుతాయి.

కుంభ రాశి..
శ్రమాధిక్యం. బంధువర్గంతో విభేదాలు ఏర్ప‌డ‌తాయి. వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు. మానసిక ఆందోళనతో కాలం గడుపుతారు. స్త్రీలు చేసే వ్యవహారాల్లో సమస్యలు ఎదురువుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం లేకపోలేదు.. రహస్య శత్రువులపట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది.ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం ఏర్ప‌డుతుంది.

మీనరాశి..
దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం. చర్చలలో పురోగతి ఏర్ప‌డుతుంది. ఆకస్మిక ధనలాభం. పరిస్థితులు సంతృప్తికరంగా సాగుతాయి.. ఆరోగ్యం గురించి శ్రద్ధవహించాలి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉండటం మంచిది. ఆలయ దర్శనాలు చేస్తారు.

 

Related posts