telugu navyamedia
రాశి ఫలాలు

ఆగస్టు 22 (ఆదివారం) రాశి ఫలాలు

మేషం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగం కోసం మరి కొంతకాలం నిరీక్షించాల్సి ఉంటుంది. ఆధ్యాత్మికత పెరుగుతుంది.

వృష‌భం: ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. కళాత్మక వస్తువులను కలుస్తారు. బంధు, మిత్రులను కలుస్తారు. కుటుంబానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా అభివృద్ధికి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల వారికి ఆర్థికంగా ఇది ఎంతో అనుకూల సమయం.

మిథునం: బంధు, మిత్రులతో కలుస్తారు. క్రీడాకారులు, రాజకీయ రంగాల్లో వారు ఉత్సాహంగా ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది. నిరుద్యోగులకు అవకాశం వస్తుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తల పెట్టిన పనులు చాలావరకు పూర్తవుతాయి.

క‌ర్కాట‌కం: మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించడం మంచిది.. కొత్త కార్యక్రమాలకు ఆటంకాలు ఏర్పడే అవకాశాలున్నాయి. . ఆకస్మిక ధనలాభం కనిపిస్తోంది. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. సొంత నిర్ణయాలు ఉత్తమం. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి.

సింహం: ఉద్యోగులకు మంచి కంపెనీలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

క‌న్య: ఆర్థికంగా బాగానే ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు లాభాలు ఆర్జిస్తారు. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.

తుల‌: ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ప్రయాణాల్లో మెలకువ అవసరం. మీ శ్రమకు, ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. లాయర్లకు, డాక్టర్లకు, చిన్న వ్యాపారులకు బాగుంటుంది.

వృశ్చికం: ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందుతారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది. సహనం అన్నివిధాలా శ్రేయస్కరం. స్నేహితుల సహాయం ఉంటుంది. . కుటుంబానికి ప్రాధాన్యం ఇస్తారు.

ధ‌నుస్సు: అధికార యోగానికి అవకాశం ఉంది. కుటుంబ కలహాలు దూరమవుతాయి. అందరితో స్నేహంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఆర్ధికంగా బాగుంటుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్త.

మ‌క‌రం: ఈ రోజు మీరు విందులు, వినోదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంది. మానసిక ఆందోళనతో ఉంటారు. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ప్రతి చిన్న విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి.

కుంభం: కష్టాలన్నీ క్రమేణ తొలగిపోతాయి. కొత్త కార్యాలకు శ్రీకారం చుడతారు. బంధు, మిత్రలతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.

మీనం: ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. నూతన కార్యాలను ప్రారంభిస్తారు. నిరుద్యోగులకు అవకాశం లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారులకు బాగుంటుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానం వల్ల సంతోషం కలుగుతుంది.

Related posts