telugu navyamedia
రాశి ఫలాలు

ఆగస్టు 19 (గురువారం) రాశి ఫలాలు

మేషం: ఉద్యోగంలో మార్పులకు అవకాశం. వివాహ సంబంధాలకు అనుకూలం. స్నేహితులు మీ సలహా తీసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారులకు అభివృద్ధి, ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. ప్రారంభించే పనులకు ఆటంకాలు రాకుండా చూసుకోండి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరికీ హామీలు ఉండొద్దు.

వృషభం: ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి గట్టెక్కుతారు. తలపెట్టిన పనులు పూర్తిచేస్తారు. వివాహ సంబంధాలకు అనుకూలం. ప్రయాణాలకు అవకాశం ఉంది. శుభవార్తలు వింటారు. పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. శుభ కార్యాలకు హాజరవుతారు. దైవ చింత పెరుగుతుంది. కొత్త స్నేహాలు ఏర్పడతాయి.

మిథునం: ఆర్థికంగా, ఆరోగ్యపరంగా బాగుంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగం మారే ప్రయత్నాలు చేస్తారు. తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. మీ సంతానంలో ఒకరికి ఉద్యోగ అవకాశం వస్తుంది. విందు, వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారులు, వృత్తి నిపుణులకు లాభదాయకం. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించండి.

కర్కాటకం: ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వివాహ సంబంధాలకు అనుకూలం. ఆర్థిక లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉండండి. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు. కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహరించండి. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి.

సింహం: ఉద్యోగంలో ప్రశాంతత ఉంటుంది. ఆర్థిక లావాదేవీలకు అవకాశం ఉంది. వ్యాపారులకు ఆర్థికంగా బాగుంది. శ్రమ అధికంగా ఉంటుంది. స్నేహితుల సహకారం ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. కుటుంబ సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. వివాహ సంబంధాలకు అనుకూలం.

కన్య: సంతానానికి సంబంధించి శుభ వార్తలు వింటారు. పనులు కొద్దిగా ఆలస్యమైనా అనుకూలంగానే పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల సలహాలు పాటిస్తారు. బంధుమిత్రుల ఒత్తిడి ఉంటుంది. బాధ్యతలను సమర్థంగా పూర్తిచేస్తారు. వ్యాపారులు బాగా శ్రమపడాలి. ప్రేమ వ్యవహారాలు ప్రోత్సాహకరం.

తుల: చిన్న వ్యాపారులకు, రియల్ ఎస్టేట్ వారికి అనుకూలం. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. దైవ చింతన పెరుగుతుంది. స్నేహితులతో మనస్పర్థలు ఏర్పడతాయి. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్త. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది.

వృశ్చికం: ఆరోగ్యానికి, ఆదాయానికి ఢోకా లేదు. ఖర్చులకు కళ్లెం వేయాలి. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. గృహ రుణాల ప్రయత్నం ఫలిస్తుంది. కీలక సమస్యను పరిష్కరిస్తారు. వ్యాపారులకు అనుకూలం. ఎవరికైనా అప్పు ఇస్తే తిరిగి రాకపోవచ్చు.

ధనుస్సు : ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. మీరు ఆశించిన విధంగా మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కొందరు బంధువుల సహకారంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారులు బాగా శ్రమపడాల్సివస్తుంది.

మకరం: ఆదాయం నిలకడగా ఉంటుంది. అనుకోకుండా డబ్బు చేతికి అంది, కొంత రుణ బాధ తగ్గుతుంది. ఇంటా బయటా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. వ్యాపారులు కష్టపడాల్సి ఉంటుంది. ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ఆచి తూచి అడుగు వేయండి. ఎవరికీ హామీలు ఉండొద్దు.

కుంభం: ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. చాలావరకు అప్పులు తీరుస్తారు. ఉద్యోగంలో బదిలీకి అవకాశం ఉంది. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది.

మీనం: ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లభించే అవకాశం. వివాహ సంబంధాలకు అనుకూలం. వృత్తి నిపుణులు రాణిస్తారు. ఆధ్యాత్మిక చింతన చేస్తారు. వ్యా పార రంగంలోని వారు విస్తరణ కార్యక్రమం చేపడతారు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఆర్థిక లావా దేవీలకు దూరంగా ఉండండి.

Related posts