మేషరాశి..
దూరప్రయాణాలు చేస్తారు. ఎంత కష్టపడితే అంత ఫలితం వస్తుంది. ఉన్నత విద్యా, విదేశీ వ్యవహారాలకు అవసరమైన నిధులు సమకూర్చుకుంటారు. విలువైన వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. ఇంటాబయటా ఒత్తిడులు ఏర్పడతాయి.
వృషభరాశి..
సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చిన్నతరహా, చిరు వ్యాపారులకు ఒత్తిడి అధికమవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆప్తులు సలహాలు పాటిస్తారు. వస్తులాభాలు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం అందుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమంలో పాల్గొంటారు.
మిథునరాశి..
ముఖ్యమైన వ్యవహారాలలో మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు.తలపెట్టిన పనులు సమయానికి పూర్తికావు. దైవదర్శనాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. అనారోగ్యం బారిన పడతారు.
కర్కాటకరాశి..
అనవసర విషయాల్లో తలదూర్చకండి. మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. మీసత్తా నిరూపించుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. విందువినోదాలల్లో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.కుటుంబ అవసరాలు, పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తాయి.
సింహరాశి..
గొప్ప భవిష్యత్తు కోసం మంచి ఆలోచనలు చేస్తారు. కుటుంబ సభ్యులకు శుభకాలం వస్తుంది.బంధువులతో తగాదాలు ఏర్పడతాయి. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. ఆరోగ్యభంగం కలుగుతుంది.
కన్యరాశి..
మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. కొత్త వ్యక్తుల పరిచయం అవుతారు. శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. ముఖ్యుల మధ్య ఆకస్మిక అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. పెద్దలను, ప్రముఖులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.
తులరాశి..
వివాదాలు పరిష్కారం అవుతాయి.వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. శుభవార్తలు వింటారు. కాంట్రాక్టర్లకు అనుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ధన, వస్తులాభాలు కులుగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుస్తారు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.
వృశ్చికరాశి..
నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. వ్యవహారాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. సోదరులతో కలహాలు. మానసికంగా దృఢంగా ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.. అనారోగ్యం బాధిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు ఏర్పడతాయి.
ధనుస్సురాశి..
స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. మిత్రులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. దూరప్రయాణాలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.బద్దకం వల్ల ఇబ్బందులు అధికం అవుతాయి.ఆరోగ్యంపై శ్రద్ధ వహించండం మంచిది.
మకరరాశి..
ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి విముక్తి కలుగుతుంది.
కుంభరాశి..
వృత్తి, వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఆర్థికంగా బాగుంటుంది. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. శుభవార్తలు వింటారు. వాహనయోగం కలుగుతుంది. భూవివాదాలు పరిష్కారం అవుతాయి.
మీనరాశి..
కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, సహకారం మీకు తోడ్పడతాయి. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్యభంగం కలుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు చేర్పులు చేస్తారు.