telugu navyamedia
రాశి ఫలాలు

సెప్టెంబర్ 29(బుధవారం) రాశి ఫలాలు

మేషం: ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్తవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

వృషభం: ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగులు అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. శుభవార్తలు వింటారు. స్నేహితుల సహకారం లభిస్తుంది. వృత్తి, వ్యాపారులకు లాభదాయకం. ఎవరికీ హామీలు ఇవ్వొద్దు.

మిథునం: ఆదాయం బాగుంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. నిరుద్యోగులకు అనుకూలం. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. వ్యాపారులకు శ్రమ ఉంటుంది. చాలావరకు
అప్పులు తీరుస్తారు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి.

కర్కాటకం: ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. మార్కెట్ రంగాల వారికి అనుకూలం. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారారులకు అనుకూలం.

సింహం: అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు. వివాహ సంబంధాలకు అనుకూలం. శుభవార్తలు వింటారు. ఇతరులకు సహాయం చేస్తారు. కొత్తపరిచయాలు ఏర్పడతాయి.

కన్య: ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులను అదుపుచేయాలి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారులకు లాభదాయకం. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వివాహ సంబంధాలకు అనుకూలం.

తుల: ఆదాయం బాగుంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఉద్యోగులకు అధికారుల ప్రోత్సాహం ఉంటుంది. కొత్త వ్యక్తులతో అప్రమత్తంగా ఉండండి. ప్రయాణంలో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండండి. వివాదాలకు పోవద్దు.

వృశ్చికం: ఉద్యోగులకు సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూర ప్రయాణాలకు అవకాశం. వ్యాపారులు, వృత్తి నిపుణులకు అనుకూలం. స్థిరాస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి.

ధనస్సు: ఆదాయంతో పాటు ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగులకు ఒత్తిడి ఉంటుంది. పాత మిత్రులను కలుసుకుంటారు. అప్పులు తీరుస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఎవరికీ హామీలు ఇవ్వొద్దు.

మకరం: ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. ఉద్యోగులకు ఉన్నతికి అవకాశం. చిరు వ్యాపారులకు అనుకూలం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పాత బకాయిలు వసూలు అవుతాయి.

కుంభం: ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగులకు పని ఒత్తిడి ఉంటుంది. కళాకారులకు గుర్తింపు లభిస్తుంది. శుభ వార్తలు వింటారు. బంధు మిత్రులను కలుసుకుంటారు. వివాహ సంబంధాలకు అనుకూలం.

మీనం: ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. ఉద్యోగులకు శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. వృత్తి, వ్యాపారులకు అనుకూలం. చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలోని సమస్యలు పరిష్కారం అవుతాయి.

Related posts