telugu navyamedia
రాశి ఫలాలు

డిసెంబ‌ర్ 27, సోమ‌వారం రాశిఫ‌లాలు

మేషరాశి..

ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారంలో కూడా శుభ ఫలితాలు ఉన్నాయి. ధనలాభం ఉంది. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్ప‌డ‌తాయి. దైవదర్శనాలు చేస్తారు. శారీరక శ్రమ పెరుగుతుంది. ఉద్యోగాలలో హోదాలు దక్కించుకుంటారు.

వృషభరాశి..

అనుకున్న పనులు చాలావరకు పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలు క‌నిపిస్తున్నాయి. పనులు మందగిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో చికాకులు ఏర్ప‌డ‌తాయి. దైవ ద‌ర్శ‌నాలు. దూరప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మెల్ల‌గా సాగుతాయి.

మిథునరాశి..

మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. సన్నిహితుల నుంచి ఒత్తిడులు ఏర్ప‌డ‌తాయి. అనుకోని ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్యం అంత‌గా స‌హ‌క‌రించ‌దు. కుటుంబపరంగా బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. శ్ర‌మకు త‌గ్గ ఫ‌లితం. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి.

కర్కాటకరాశి..

నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కొత్త పనులు చేపడతారు. బందువుల‌తో స‌ర‌దాగా గడుపుతారు. నూతన విద్యావకాశాలు వ‌స్తాయి. వ్యాపారాలు ముందుకు సాగుతాయి.తగినంత ప్రయత్నం చేస్తే అదృష్టం మీదవుతుంది. బాధ్యతలను సమర్ధవంతంగా పూర్తి చేస్తారు.

సింహరాశి..

కుటుంబంలో సమస్యలు త‌గ్గుముఖం ప‌డ‌తాయి. దూరప్రయాణాలు చేస్తారు. అనారోగ్యం. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి.. నిరుద్యోగులకు నిరాశ త‌ప్ప‌దు. వ్యాపారాలు కొన్ని చిక్కులు ఏర్ప‌డ‌తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు పెరుగుతాయి.

కన్యరాశి..

అవసరాలకు డబ్బు అందుతుంది. ఆదాయానికి సంబంధించి మిశ్రమ ఫలితం ఉంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. సేవాకార్యక్రమాలు చేపడతారు. స్థిరాస్తి వృద్ధి. దైవదర్శనాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి. బంధువులతో విబేధాలు వచ్చే సూచనలు క‌నిపిస్తున్నాయి.

తులరాశి..

కుటుంబపరంగా కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. చేస్తున్న పనులలో పురోగతి ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర‌వుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. పనుల్లో అవాంతరాలు ఏర్ప‌డ‌తాయి. ఆస్తి వివాదాలు త‌లెత్తుతాయి. ఆరోగ్యభంగం. వ్యాపారాలు న‌త్త న‌డ‌క సాగుతాయి.

వృశ్చికరాశి..

వ్యాపారంలో శ్రమ, ఒత్తిడి పెరుగుతాయి. ప్రయత్నాల్ని కొనసాగిస్తే విజయం సిద్ధిస్తుంది. జీవితంలో స్థిరత్వం ఏర్పడడానికి మంచి సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. పనుల్లో పురోగతి ఏర్ప‌డుతుంది. భూవివాదాలు తీరతాయి. భూములు, వాహనాలు కొంటారు. ఆకస్మిక ధనలాభం. నిరుద్యోగుల‌కు ఇంటర్వ్యూలు అందుతాయి.

ధనుస్సురాశి..

మొహమాటంతో డబ్బులు ఖర్చు చేయకండి. బంధుమిత్రులతో మాట పట్టింపులకు పోరాదు. కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని మంచి రోజులు వ‌స్తాయి. బ‌య‌ట ప‌ని చేసే వారికి శ్రమ ఫలిస్తుంది. . వ్యాపారంలో లాభాలకు అవకాశం ఉంది. కుటుంబ సమస్యల పరిష్కారం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

మకరరాశి..

ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. సంపద పెరిగే సూచనలున్నాయి. వ్యాపారపరంగా శ్రమ ఎక్కువవుతుంది. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. పనులలో తొందరపాటు. దూరప్రయాణాలు చేస్తారు. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు ఎదుర‌వుతాయి. దైవ‌ద‌ర్శ‌నాలు చేస్తారు.

కుంభరాశి..

సమయం అంతగా అనుకూలంగా లేదు. ప్రతి పనికీ ఆటంకాలు ఎదురవుతాయి. ముఖ్య కార్యాలు వాయిదా వేయడ౦ మంచిది. కష్టపడ్డా ఫలితం త‌గ్గ‌దు. అనారోగ్యం బారిన ప‌డ‌తారు. వ్యవహారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో కొన్ని సమస్యలు ఏర్ప‌డ‌తాయి.బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమంలో పాల్గొంటారు.

మీనరాశి..

వ్యాపారంలో బాగా లాభాలు వ‌స్తాయి. మిత్రుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. వాహనయోగం క‌లుగుతుంది. బంధువుల‌తో విందువినోదాలు పాల్గొంటారు. ఆస్తిలాభం ఉంటుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ప్రోత్సాహం ఏర్ప‌డుతుంది..ఆరోగ్యం కాపాడుకోవాలి.

 

Related posts