telugu navyamedia
రాశి ఫలాలు

డిసెంబర్‌ 14, మంగళవారం రాశిఫలాలు…

మేష రాశి..

మానసికంగా దృఢంగా ఉంటారు. బంధుమిత్రుల సహాయం అందుతుంది. పడనివారితో దూరంగా ఉండటం మంచిది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. నేర్పుగా సమస్యలు పరిష్కరించుకుంటారు. కంపెనీ వ్యవహారాలు, వృత్తి వ్యాపారాల గురించి సన్నిహితులతో చర్చిస్తారు. బంధువుల రాకతో చేపట్టి పనులు వాయిదా పడతాయి. దైవ ద‌ర్శ‌నాలు చేస్తారు.

వృషభ రాశి..

ఆరోగ్యంపై దృష్టి సారించాలి. బంధు మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి అనుకూలం ఉంటుంది. మానసిక శక్తి పెంచుకోవడం మంచిది. ఉద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. అధికారులతో జాగ్రత్తగా ఉడాలి. దైవదర్శనాలు చేస్తారు. అనారోగ్యం బారిన ప‌డ‌తారు.

మిథున రాశి..

పెండింగ్‌లో ఉన్న ఓ సమస్య పరిష్కారం అవుతుంది. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి, పనిభారం అధికం. స్త్రీలు దైవసేవా కార్యక్రమాల కోసం ధనం బాగా ఖర్చు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో లాభాలు పొందుతారు. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు పడాతారు.

కర్కాటక రాశి..

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. కీలక విషయాలలో నిర్ణయాలు తీసుకుంటారు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి.

సింహ రాశి..

అధికారులతో మంచి సంబంధాలు ఏర్పర్చుకుంటారు. వ్యవసాయ, తోటల రంగాల్లో వారికి వాతావరణంలో మార్పు ఆందోళన కలిగిస్తుంది. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. సమస్యలను అధిగమిస్తారు. కొన్ని విషయాలలో ఆటంకాలు ఎదురవుతాయి. అధికంగా శ్రమించాల్సి ఉంటుంది.

కన్య రాశి..

అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ద వహించ‌డం మంచిది. కొన్ని ముఖ్యమైన పనులలో పురోగతి సాధిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. మిత్రులతో విభేదాలు ఏర్ప‌డ‌తాయి.

తుల రాశి..

దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఊహించని ఖర్చులు మీ ఆదాయం మించటంతో ఒకింత ఒడిదుడుకులు తప్పవు. కుటుంబ సభ్యుల నుంచి సాయం అందుకుంతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది.

వృశ్చిక రాశి..

చేపట్టే పనులలో ఆటంకాలు ఎదురైనా ధైర్యంతో పూర్తి చేస్తారు. కుటుంబంలో సానుకూల వాతావరణం ఉండకపోవచ్చు. గోసేవా చేయడం వల్ల మంచి జరుగుతుంది. భాగస్వామిక చర్చలు వాయిదా పడటం మంచిది. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. నిరుద్యోగుల నిర్లక్ష్యం వల్ల ఒక మంచి అవకాశం చేజారిపోయే ఆస్కారం ఉంది.

ధనుస్సు రాశి..

మీ సంతానం ఉన్నత చదువుల కోసం దూర ప్రయాణం చేయవలసి వస్తుంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి, శ్రమ తప్పవు. ఎదురయ్యే ఆటంకాలను అధిగమించే ప్రయత్నం చేస్తారు. ముఖ్యమైన పనులను చేపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు. అధికంగా శ్రమించాల్సి ఉంటుంది.

మకర రాశి..

కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. దైవ సేవా కార్యాక్రమాలల్లో చురుకుగా వ్యవహరిస్తారు. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు నిర్మాణ పనులలో ఏకాగ్రత ముఖ్యం. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఇతర విషయాలలో జోక్యం కలిగించుకోకపోవడం మంచిది. ఆస్తి వ్యవహారాల్లో పెద్దల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది.

కుంభ రాశి..

విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు అతికష్టంమ్మీద అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు టెక్నికల్, ఇంజనీరింగ్ కోర్సులలో అవకాశాలు లభిస్తాయి. కొన్ని వ్యవహారాలలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ధైర్యంతో ముందుగా సాగితే మంచి ఫలితాలు ఉంటాయి.

మీన రాశి..

ముఖ్యమైన విషయాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఎంతో మంచిది. రుణ సమస్యల నుంచి విముక్తులవుతారు. బంధువుల రాక సంతోషం కలిగిస్తుంది. కార్యసాధనలో ఓర్పు, పట్టుదల ఎంతో ముఖ్యమని గమనించండి. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. పెద్దలను సంప్రదించి కీలక లావాదేవీలు చేయడం మంచిది.

Related posts