telugu navyamedia
రాశి ఫలాలు

అక్టోబర్7(గురువారం) రాశి ఫలాలు

మేషం: ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు.

వృషభం: ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు అందుకుంటారు. కొన్ని కీలక సమస్యలు పరిష్కారమవుతాయి. చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. వివాహ ప్రయత్నాలకు అనుకూలం. సంతానం నుంచి శుభవార్తలు వింటారు.

మిథునం: ఆర్థికంగా పర్వాలేదు. ఉద్యోగులకు అనుకూలం. మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్తారు. వ్యాపారంలో అప్రమత్తంగా ఉండండి. శ్రమతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. పెద్దవారితో పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాల్లో జాగ్రత అవసరం.

కర్కాటకం: ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. శ్రమ మీద ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల సలహాలు పాటించండి. వ్యాపారంలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. శుభవార్తలు వింటారు.

సింహం: ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. శుభవార్తలు వింటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో విజయం లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్తగా ఉండండి.

కన్య: ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఉద్యోగంలో శ్రమ, ఒత్తిడి పెరుగుతాయి. వివాదాలకు పోవద్దు. వివాహ ప్రయత్నాలకు అనుకూలం. బంధుమిత్రుల నుంచి సహకారం అందుతుంది. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

తుల: ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. శ్రమ మీద పనులు పూర్తి చేసుకుంటారు. ఉద్యోగపరంగా కొత్త అవకాశాలు వస్తాయి. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన సమస్య పరిష్కారమవుతుంది. భవిష్యత్తుకు బాటలు వేస్తారు.

వృశ్చికం: వ్యాపారంలో ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. పనులలో ఆటంకాలు ఎదురైనా పూర్తిచేస్తారు. అధికారుల ప్రశంసలు ఉంటాయి. కుటుంబ బాధ్యతల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి.

ధనుస్సు: ఉద్యోగంలో సానుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారులకు లాభదాయకం. ముఖ్యమైన సమస్య ఒకటి పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. శుభ వార్తలు వింటారు.

మకరం: ఆదాయంతో పాటు ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. ఉద్యోగంలో ఉన్నతికి అవకాశం. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

కుంభం: ఆర్థిక స్థితి బాగుంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన పనుల్లో అప్రమత్తంగా ఉండాలి. తోటివారి సహకారంతో కొన్ని సమస్యలు పరిష్కరిస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో మెళకువగా వ్యవహరించాలి. అవసరానికి డబ్బు అందుతుంది.

మీనం: ఉద్యోగంలో శ్రమ అధికమైనా మంచి ఫలితం ఉంటుంది. ఆటంకాలను ఎదురైనా చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. మీ సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్లండి. అభివృద్ధికి ఉపయోగపడే ఆలోచనలు చేస్తారు. వివాహ ప్రయత్నాలకు అనుకూలం.

Related posts