telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణ దంపతులకు గవర్నర్ సత్కారం..

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులు తేనీటి విందునిచ్చారు. జస్టిన్ ఎన్వీ రమణను అధికారిక లాంఛనాలతో ఘనంగా స్వాగతించారు. రాజ్ భవన్ ఆవరణలో పుష్పగుచ్ఛాలను అందించి శుభాకాంక్షలు తెలిపారు.

మూడు రోజులుగా రాష్ట్ర పర్యటనలో ఉన్న సుప్రీం ప్రధాన న్యాయమూర్తి గవర్నర్ ఆహ్వానం మేరకు ఆదివారం సాయంత్రం రాజ్ భవన్ కు విచ్చేసారు. ఎన్ వి రమణ , శివమాల దంపతులకు రాజ్ భవన్ ప్రత్యేక ప్రదాన కార్యదర్శి సిసోడియా ఘనంగా స్వాగతం పలికారు. పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు.
ముందుగానే రాజ్ భవన్ చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి , ఆయన సతీమణి భారతి ప్రధాన న్యాయమూర్తి దంపతులను రాజ్ భవన్ దర్బార్ హాలులోకి తీసుకొచ్చారు.


తొలుత రాజ్ భవన్ కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా రాగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వినీత్ శరణ్, జెకె మహేశ్వరి దంపతులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణతో కలిసొచ్చారు. దర్బారు హాలులో గౌరవ గవర్నర్ తో భేటీ ఎన్వీరమణ సమకాలీన అంశాలపై కాసేపు సరదాగా చర్చించారు.

ఈ కార్యక్రమంలో శాసనపరిషత్తు సభ్యుడు తలశిల రఘురామ్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, అదనపు కార్యదర్శులు ధనుంజయ రెడ్డి, ముత్యాల రాజు, జిల్లా కలెక్టర్ నివాస్, సిపి కాంతి రాణా టాటా, ఐఎఎస్ అధికారులు కృతికా శుక్లా, షన్ మోహన్, రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్, ప్రోటోకాల్ డైరెక్టర్ బాల సుబ్రమణ్య రెడ్డి, రాజ్ భవన్ ఉపకార్యదర్శి సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు. తేనీటి విందు సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణ దంపతులతోకలసి గ్రూపు ఫోటో దిగారు.

Related posts