telugu navyamedia
ట్రెండింగ్ రాశి ఫలాలు వార్తలు

అక్టోబర్ 21, 2020 రాశిఫలాలు : ఉద్యోగులకు శుభవార్త..వ్యాపారాలకు ఉత్సాహాం

మేషం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. వాహనయోగం. కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యాపారాల విస్తరణ. ఉద్యోగులకు సంతోషకరమైన వార్తలు.

వృషభం: కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. కుటుంబసభ్యులతో అకారణంగా విభేదాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం.

మిథునం: మిత్రులు, బంధువుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతంత మాత్రంగా ఉంటాయి.

కర్కాటకం: ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. విద్య, ఉద్యోగావకాశాలు. ప్రముఖ వ్యక్తుల పరిచయం. వృత్తి, వ్యాపారాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి.

సింహం: కొత్త మిత్రుల పరిచయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం. భూలాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వృత్తి, వ్యాపారాలు సంతృప్తినిస్తాయి.

కన్య: ఆదాయానికి మించి ఖర్చులు. అదనపు బాధ్యతలు. కుటుంబసభ్యులతో తగాదాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.

తుల: అనుకున్న పనుల్లో ఆటంకాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. సోదరులతో స్వల్ప వివాదాలు. మానసిక అశాంతి. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగించవచ్చు.

వృశ్చికం: దూరపు బంధువులు సహాయపడతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. ఇంటాబయటా అనుకూలం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

ధనుస్సు: శ్రమ తప్పదు. పనుల్లో ప్రతిబంధకాలు. రుణయత్నాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

మకరం: శుభవార్తలు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. అదనపు రాబడి. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు అనుకూల వాతావరణం.

కుంభం: దూరప్రయాణాలు. ఆదాయం తగ్గి అప్పులు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో ఆటంకాలు. వృత్తి, వ్యాపారాలు కొంత నిరాశ పరుస్తాయి.

మీనం: పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. చిన్ననాటి విషయాలు తెలుస్తాయి.ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం. వ్యాపార, ఉద్యోగాలలోఅంచనాలు నిజమవుతాయి.

Related posts