మేషం: కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. ఉద్యోగులకు అనుకూలం. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారులు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.
వృషభం: ఆర్థికస్థితి కొంత మేరకు మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. తలపెట్టిన పనులు చాలావరకు పూర్తి చేస్తారు. బంధువుల రాకపోకలు ఉంటాయి. వ్యాపారులకు అన్నివిధాలా బాగుంది. ఆరోగ్యం జాగ్రత్త.
మిధునం: ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఆర్థికంగా చాలా బాగుంది. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగులకు అనుకూలం. కోర్టు కేసు అనుకూలం అవుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.
కర్కాటకం: ఉపాధ్యాయులకు అనుకూలంగా ఉంది. సంఘంలో మంచి గుర్తింపు, గౌరవం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు తగ్గించుకోండి. ఆరోగ్యం విషయంలో జగ్రత్త వహించాలి. వ్యాపారంలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. వ్యాపారులకు అనుకూలంగా ఉంది.
సింహం: సమయం అనుకూలం. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులకు బాగుంటుంది.
కన్య: ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. విదేశాల నుంచి ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్ వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది.
తుల: ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. ప్రముఖుల పరిచయాలు పెరుగుతాయి. లాయర్లకు, సామాజిక కార్యకర్తలకు అనుకూలంగా ఉంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు అనుకూలం.
వృశ్చికం: వ్యాపారాభివృద్ధికి కొత్త ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.
ధనస్సు: ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. రియల్ ఎస్టేట్ వారికి, స్వయం ఉపాధి వారికి అనుకూలంగా ఉంది. వివాహ ప్రయత్నాలకు అనుకూలం. చేపట్టిన పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం జాగ్రత్త.
మకరం: వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు, ప్రణాళికలు మంచి ఫలితాలనిస్తాయి. రుణ విముక్తులయ్యే ప్రయత్నం చేస్తారు. వివాహ ప్రయత్నాలు సఫలం అవుతాయి. సంతానం నుంచి శుభవార్త వింటారు.
కుంభం: ఆదాయం బాగుంటుంది. శ్రమ మీద చేపట్టిన పనులు పూర్తవుతాయి. శుభకార్యాలకు అవకాశం ఉంది. ఉద్యోగులకు అనుకూలంగా ఉంది. వ్యాపారుల లాభాలు నిలకడగా ఉంటాయి. ఆరోగ్యం జాగ్రత్త.
మీనం: ఉద్యోగులకు అనుకూలం. ఆరోగ్యం జాగ్రత్త. అప్పుల వాళ్ల ఒత్తిడి తగ్గించుకుంటారు. వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం బాగుంటుంది.