telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

ఎండాకాలంలో పటికబెల్లం ఉపయోగాలు తెలిస్తే అస్సలు విడిచి పెట్ట‌రు!

Summer Sun Temperatures AP

ప‌టిక‌బెల్లం అంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది తియ్యటి రుచిని కలిగి ఉంటుంది. చెక్కర యొక్క శుద్ధి చేయబడని రూపమే ఈ పటికబెల్లం. దీన్ని వంటల్లోనూ మరియు వైద్య ప్రయోజనాల కోసం వాడతారు.

పటికబెల్లం శరీరానికి చలువ చేస్తుంది, జీర్ణశక్తిని పెంచి దేహానికి బలాన్ని, వీర్యపుష్టిని ఇస్తుంది. వాత, పిత్త , కఫ దోషాల వ‌ల్ల క‌లిగే అనేక రోగాల‌కు ఔషధంగా పనిచేస్తుంది. అయితే తియ్యగా ఉందికదా అని ఎక్కువ తింటే మాత్రం మలబద్దకం వ‌స్తుంది. ఈ క్ర‌మంలోనే ప‌టిక బెల్లంతో మ‌న‌కు క‌లిగే ఇతర ఉపయోగాలు ఏమిటోఇప్పుడు తెలుసుకుందాం.

పటికబెల్లం పొడి 36 గ్రాములు, దోరగా వేయించిన శొంఠి పొడి 48 గ్రాములు, దోరగా వేయించిన మిరియాల పొడి 30 గ్రాములు తీసుకుని ఈ మూడిటినీ బాగా కలిపి అనంతరం వ‌చ్చే చూర్ణాన్ని పూటకు 3 గ్రాముల చొప్పున‌ 6 గ్రాముల‌ నెయ్యిలో కలిపి రెండు పూటలా తింటే అతిమూత్ర వ్యాధి తగ్గుతుంది.

అరటిపండును పటికబెల్లం పొడితో అద్దుకొని తింటూ ఉంటే నీళ్ల విరేచనాలు త‌గ్గుతాయి.

పటికబెల్లం పొడిని, పసుపు పొడిని నిప్పుల మీద చల్లి దాని వాసన రెండు పూటలా పీలుస్తూ ఉంటే జలుబు, పడిశం వంటివి తగ్గిపోతాయి .

పటికబెల్లం పొడి 3 గ్రాములు, ఒక టీ స్పూన్ పుదీనా ఆకుల రసం కలిపి రోజూ రెండు లేక మూడు పూటలు సేవిస్తూ ఉంటే ఎక్కిళ్లు తగ్గిపోతాయి.మూడు, లేదా నాలుగు దొండ పండ్ల‌ను పటికబెల్లం పొడిలో అద్దుకొని తింటూ ఉంటే కేవలం రెండంటే రెండే రోజుల్లో దగ్గు తగ్గిపోతుంది.

పటికబెల్లం పొడి 3 గ్రాములు, కొబ్బరి కోరు 3 గ్రాములు కలిపి పిల్లలుకు తినిపిస్తే ఎక్కిళ్లు తగ్గుతాయి .వేడివేడి పాలల్లో పటికబెల్లం పొడి కలిపి రెండు లేక మూడు పూటలు తాగితే అతిగా మాట్లాడటం వలన వ‌చ్చే గొంతు బొంగురు తగ్గిపోతుంది.

పటికబెల్లం 24 గ్రాములు, గసగసాలు 12 గ్రాములు తీసుకుని ఈ రెండింటినీ కలిపి మెత్తగా నూరి నిల్వ‌ ఉంచుకుని పూటకు 6 గ్రాముల‌ మోతాదులో 24 గ్రాముల వెన్నతో కలుపుకుని రెండు పూటలా తింటే గర్భిణీ స్త్రీలలో వ‌చ్చే గర్భ ఉడుకు , కడుపు నొప్పి, రక్త విరేచనాలు, జిగట విరేచనాలు వంటివి తగ్గిపోతాయి.

కొంచెం పటికబెల్లం చూర్ణాన్ని నీటిలో కలిపి కరిగించి వడపోసి ఆ నీటిని రెండు లేదా మూడు చుక్కలు కళ్ల‌లో వేసుకుంటే క‌ళ్ల‌ కలకలు త‌గ్గిపోతాయి.

ప‌టిక‌బెల్లం, మరియు మంచి గంధంల‌ను సాన మీద అర‌గ‌దీసి.. ఒక్కొక్క‌టి 24 గ్రాముల మోతాదులో తీసుకొని, అంతే మొత్తంలో తేనెను తీసుకుని ఈ మూడింటినీ 60 గ్రాముల‌ బియ్యం కడిగిన నీటిలో కలిపి పూటకు ఒక సారి తీసుకుంటే రక్త విరేచనాలు, జిగట విరేచనాలు త‌గ్గుతాయి. దీంతో శ‌ర‌రీంలో ఏర్ప‌డే మంటలు కుడా తగ్గుతాయి.

పటికబెల్లం 20 గ్రాములు, ఆవువెన్న 20 గ్రాములు, పొట్టు తీసిన బాదం పప్పులు 7 తీసుకుని ఈ మూడింటినీ కలిపి ఒక మోతాదుగా ఉదయం పూట ఒక్కసారి మాత్రమే తీసుకుంటూ ఉంటే ద‌గ్గు త‌గ్గుతుంది.

పాలల్లో పటికబెల్లం పొడి వేసి క‌లిపి తాగుతూ ఉంటే బలహీనత‌ వల్ల వచ్చిన దాహం త‌గ్గుతుంది.

సొరకాయ ముక్కలను దంచి ర‌సం తీసి, దాన్ని 60 గ్రాముల మోతాదులో తీసుకుని అందులో 24 గ్రాముల‌ పటికబెల్లం పొడి కలిపి రోజు రెండు పూటలా తాగుతూ ఉంటే వారం రోజుల్లో కామెర్లు తగ్గిపోతాయి.

పటికబెల్లం ముక్కను నీళ్లతో అరగదీసి ఆ గంధాన్ని తేలు కుట్టిన చోట రాసి మర్దన చేస్తూ ఉంటే 6 నిమిషాల్లో తేలు విషం దిగిపోతుంది.

నిమ్మపండు ముక్క మీద కొద్దిగా పటికబెల్లం పొడి అద్ది బుగ్గన పెట్టుకుని చప్పరిస్తూ ఉంటే వాంతులు తగ్గిపోతాయి .

పటికబెల్లం పొడి , తామరపువ్వు రేకులు కలిపి ముద్దగా నూరి ఉదయం పూట మాత్రమే తింటూ ఉంటే రక్తం పడే మూల వ్యాధి త‌గ్గుతుంది.

పటికబెల్లం పొడి 3 గ్రాములు, ఒక టీ స్పూన్ పుదీనా ఆకుల రసం కలిపి ప్రతిరోజూ రెండు లేక మూడు పూటలు సేవిస్తూ ఉంటే దద్దుర్లు తగ్గుతాయి.

మీరు భోజనం చేసిన తరువాత నోరు కడుక్కోకపోయినా, నోరు పుక్కిలించకపోయినా, ఆ బాక్టీరియా చిగుళ్ళ సందుల్లో ఉండిపోయి చెడు వాసన కలిగిస్తుంది. పటిక బెల్లం భోజనం తరవాత తింటే ఈ చెడు వాసన పోగొట్టి , తాజా శ్వాస నింపుతుంది.ఇవేకాక మరెన్నో ఉపయోగాలు పటికబెల్లం వలన కలుగుతాయి.

Related posts