telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ : .. మహిళా సీఎస్ నియామకం .. అందుకేనా..

reason for women cs to AP

రాష్ట్ర సీఎంగా పదవి చేపట్టిన వెంటనే జగన్ తన కేబినెట్ లో ఏకంగా ముగ్గురు మహిళలకు చోటిచ్చారు, వారిలో ఒకరికి డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టగా, మరో మహిళకు ఏకంగా రాష్ట్ర హోం మంత్రి పదవిని ఇచ్చేశారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ప్రథాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అయిన మహిళా అధికారి నీలం సహానీని ఎంపిక చేశారు. ప్రస్తుత సీఎం ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని సీఎస్ స్థానం నుంచి బదిలీ చేసిన జగన్ సర్కారు… ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న నీలం సహానీని ఉన్నపళంగా అమరావతికి రప్పించిందట.

నీలం సహానీ కెరీర్ ను పూర్తి స్థాయిలో పరిశీలించిన ఏపీ ప్రభుత్వం తనకు అప్పజెప్పిన ఏ పనిని అయినా సమర్థవంతంగా పూర్తి చేయడంలో ఏమాత్రం అలసత్వం వహించదని, గ్రహించిన కారణంగానే కొత్త సీఎస్ అధికారిగా నీలంను ఎంపిక చేసామని వెల్లడించారు. ఇప్పటికే తన కేబినెట్ లో ముగ్గురు మహిళలకు మంత్రి పదవులతో పాటు ఓ డిప్యూటీ సీఎం పోస్టు హోం శాఖ సహా కీలక శాఖలు అప్పగించిన జగన్… ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పాలనలో అత్యంత కీలకమైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవిని కూడా మహిళా అధికారికి కేటాయించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

Related posts