వ్యాక్సిన్ అంటే వ్యాధిని కలుగజేసే క్రిమి / దాని భాగాలను నిర్వీర్య స్థితిలో మనిషికి ఇచ్చి, కృత్రిమంగా తేలికపాటి ఇన్ఫెక్షన్ ను కలుగ చెయ్యడం. ఇది పూర్తిగా నియంత్రితం, అంటే ఒక స్థాయికి మించి ఇన్ఫెక్షన్ ముందుకు వెళ్లదు. అర/ ఒక మిల్లీ లీటర్ పరిమాణములో వైరస్ / దాని భాగాలను ఇంజక్షన్ ఇవ్వడం వల్ల… జబ్బు సోకినపుడు వృద్ధి చెందినట్లుగా వైరస్ వృద్ధి చెందే అవకాశం ఉండదు. వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తిలో రోగ నిరోధక వ్యవస్థ చైతన్యమై, తర్వాతి కాలంలో కొరోనావైరస్ సోకితే… శరీరం మరీ ఎక్కువ జబ్బు పడకుండా రక్షణ ఏర్పాట్లు చేసుకుంటుంది. కరోనావైరస్ కలుగచేసే కోవిడ్ జబ్బులో ఊపిరితిత్తుల కణజాల వాపు (Inflammation ), రక్తం గడ్డ కట్టడం (హైపర్ కొయాగ్యులాబిలిటీ / Coagulopathy) అనేవి ప్రధానమైన సమస్యలు. కణజాలవాపు మూలంగా ఊపిరి అందడంలో ఇబ్బంది, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడం జరుగుతుంది. అలాగే రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి ఊపిరితిత్తుల్లో అయితే తీవ్రంగా శ్వాస ఇబ్బందులు, మెదడు రక్తనాళాల్లో అడ్డుపడితే పక్షవాతం, ఇతర బ్రెయిన్ స్ట్రోక్ సమస్యలు ఎదురు కావొచ్చు. కొన్నిసార్లు ప్రాణాపాయం కూడా కావొచ్చును. అందుకే కోవిడ్ చికిత్సలో రక్తం గడ్డకట్ట కుండా హెపారిన్, ఏస్పిరిన్ వాడకం అనేది ఒక తప్పనిసరి భాగం అయ్యింది. అలాగే వాపుకి కోర్టీకోస్టేరాయిడ్ ఇస్తారు. అయితే వాపు కన్నా రక్తం గడ్డ కట్టడం అనేది ఎక్కువ ప్రమాదకరం. వ్యాక్సిన్ అంటేనే తేలికపాటి జబ్బును కృత్రిమంగా కలుగచెయ్యడం కదా… అందువల్ల
#వాక్సిన్_ఇచ్చినపుడు_జబ్బులో_వుండే_ఇబ్బందులు_కొద్దిగానైనా_తలెత్తుతాయి. దీని మీద పెద్దగా చర్చ లేదు. తాజాగా, వాక్సిన్ తీసుకున్న కొందరిలో ఈరకంగా క్లాట్.. రక్తం గడ్డ కట్టడం గురించి వైద్య రంగం చర్చిస్తున్నది. ఈ దుష్పరిమాణం వల్ల, విదేశాలలో ఒక వాక్సిన్ ను వాడకం నిలిపివేశారు.వాక్సిన్ తీసుకున్న వారిలో క్లాట్ కాకుండా ఉండటానికిగానూ….
టీకా తీసుకొనే ముందు రోజు నుండి ఏస్పిరిన్ #Ecosprin 150 మాత్ర ఒకటి మధ్యాహ్నం భోజనం తర్వాత నాలుగు వారాలు తీసుకోవాలి. దీనివల్ల పెద్ద ఇబ్బంది లేదు… గుండె కు సంబంధించి సమస్యలు ఉన్నవారికి నెలలు, సంవత్సరాలే కాదు…కొందరికి దశాబ్దాలపాటు (జీవితాంతం) ఏస్పిరిన్ ఇవ్వడం చాలా మందికి తెలుసు. అయితే జీర్ణాశయంలో అల్సర్ ఉన్న వారికి ఆస్పిరిన్ వల్ల ఇబ్బంది ఉంటుంది.అలాంటివారిలో కడుపులో రక్తస్రావం కావొచ్చును.
కడుపులో మంట రాకుండా
#Famtac 40 రోజూ సాయంత్రం వేసుకోవాలి. మరీ
గ్యాస్ట్రిక్ ఇబ్బంది ఉంటే
#Gelusil లిక్విడ్ వాడ వచ్చును.
ఇకపోతే ఆస్త్మా, ఇతర ఎలర్జీలు వున్న వారు తాము వాడే Montelukast10mg+ Levocetirizine 5mg మాత్రలు లేదా ఇతర మాత్రలు వాడాలి.
ఏడుకొండలు మినహా అంతటా వైసీపీ రంగులే: పవన్ కళ్యాణ్