telugu navyamedia
ఆరోగ్యం

రాగి జావ‌తో ఎన్ని లాభాలో తెలిస్తే షాకే..!

రాగి జావ‌ ఆరోగ్యానికి ఎంతో మంచిది. రోజూ ఉదయాన్ని రాగి జావ తాగితే చాలా రోగాలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు అభిప్రాయడుతున్నారు. శరీరంలో చలువని పెంచేందుకు మన పూర్వీకుల జావను తయారు చేసుకుని తాగేవారు. ఈ జావ‌ను కాలంతో సంబంధం లేకుంగా దీన్ని తాగ‌వ‌చ్చు.

వరి లో ఉన్నంత ప్రొటీన్ రాగుల్లో కూడా ఉంటుంది. అయితే, ఈ ప్రొటీన్ మిగత ఆహార పదార్థాల్లో అంతగా లభించదు. ఇది శారీరక ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉన్నన్ని పోషకాలు మిగిలిన ఏ ధాన్యాలలోనూ లేవు.

మొదట్లో జవాల వాడకం తక్కువగా ఉన్నా.. ఈ మధ్య కాలంలో వీటి ప్రాధాన్యత పెరిగింది. జవాలు చేసే ఉపయోగాలు తెలిసినప్పటి నుంచి వీటి వాడకం ఎక్కువైపోయింది.

రాగి మాల్ట్, రాగి లడ్డూ, రాగి హల్వా, రాగి పకోడా, రాగిఇడ్లీ, రాగి బిస్కెట్లూ, రాగి దోసె, రాగి సంకటి లాంటివి వంటలు చేస్తుంటారు.

20 Healthy & Delicious Ragi Recipes For Diabetes by Archana's Kitchen

1. ఇందులో కాల్షియం పుష్క‌లంగా ఉంటుంది. దీనివ‌ల్ల ఎముకలు దృఢంగా ఉంచడంతో ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రోటీన్లు, విటమిన్లు, ఏ,బీ,సీ ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.

2. రాగి జావ రోజూ ఉద‌యం తాగ‌డం వ‌ల‌న జీర్ణశక్తి మెరుగుపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది.

3. రాగుల్లో మినరల్స్‌ కూడా ఎక్కువగా ఉంటాయి. మిగిలిన ధాన్యాల్లో కంటే ఇందులో కాల్షియం 5-30శాతం ఎక్కువగా ఉంది. ఇందులో ఫాస్ఫరస్‌, పోటాషియం, ఐరన్‌ కూడా ఎక్కువగా ఉన్నాయి.

4 . కాల్షియం సప్లిమెంట్‌ తీసుకునే బదులు రాగులు తినడం మంచిది. వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా మారతాయి. అందుకే వయసు పెరిగిన వారు.. చిన్నపిల్లలు వీటిని రెగ్యులర్‌గా తీసుకోవాలి.

5. రాగి జావ తాగితే రోజంతా ఉత్సాహంగా ఉండ‌వ‌చ్చు.

Ragi (Nachni) for Babies - Health Benefits & Recipes

6. ఎదిగే పిల్ల‌లకు బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. మెద‌డు చురుగ్గా ఉండ‌టానికి స‌హాయ‌ప‌డుతుంది.

7. రాగుల్లో ఎక్కువగా పీచు పదార్ధాలు ఉన్నాయి. కావున వీటివల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండటమే కాక, పేగులలో పుండ్లు, అతిసార, పెద్ద పేగు కాన్సర్‌ నుంచి రక్షణ లభిస్తుంది. బరువును కూడా తగ్గిస్తాయి.

8. రాగులలో రక్తంలోని కొలెస్ట్రాల్‌ను నియంత్రించి గుండెను రక్షిస్తాయని పేర్కొంటున్నారు. రక్త ప్రసరణ మంచిగా జరుగుతుంది బీపీ షుగ‌ర్ అదుపులో ఉంటాయి.

Ragi Nutritional value per 100g, Finger Millet Health Benefits, Ragi Recipes

9. రక్తహీనత సమస్యను దూరం చేస్తాయి. నాడీ వ్యవస్థ పనితీరును పెంచుతాయి. ఎముకలు ధృఢంగా ఉంచడమే కాకుండా కండరాలకు బలం చేకూరుతుంది.

10. యాంటీ-బాక్టీరియల్ గుణాలు రాగుల్లో పుష్కలంగా ఉంటాయి. కాబట్టి, ఫుడ్ పాయిజనింగ్ కీ, టైఫాయిడ్ లాంటి జ్వరాలకీ, సెల్యులైటిస్ లాంటి స్కిన్ ఇన్ ఫెక్షన్స్ ఉన్నప్పుడు వీటిని జావలా చేసుకుని తాగడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడొచ్చు.

.

Related posts