telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఏపీలో పంచాయతీ ఎన్నికల్లో సమస్యలు…

ఏపీలో తొలిదశ పంచాయతి ఎన్నికలు ప్రారంభం అయ్యాయి.  ఈరోజు ఉదయం 6:30 గంటల నుంచి ప్రారంభమయ్యి మధ్యాహ్నం 3:30 గంటల వరకు ఎన్నికలు జరుగుతాయి. అయితే ఈ ఎన్నికలో సమస్యలు తలెత్తుతున్నాయి. మొదట నెల్లూరు జిల్లాలో అల్లూరు మండలం ఇసుకపల్లి గ్రామంలో ఓ సంఘటన చోటు చేసుకుంది.  ఇసుకపల్లి గ్రామస్తులు ఎన్నికలకు దూరంగా ఉంటామని తీర్మానించుకున్నారు.  ఇద్దరు అభ్యర్థుల పేర్లను కావాలని తొలగించారని నిరసన వ్యక్తం చేస్తూ, ఈ నిర్ణయం తీసుకున్నారు గ్రామస్తులు. ఈ గ్రామం మినహా అన్ని చోట్ల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నట్టు ఎన్నికల కమిషన్ నుంచి అందుతున్న సమాచారం బట్టి తెలుస్తోంది. అలాగే చిత్తూరు జిల్లా రామంచంద్రాపురం మండలంలోని కమ్మకండ్రిగలో టీడీపీ నేతలు ఆందోళనలు చేస్తున్నారు.  ఓటర్ స్లిప్ లపై ఎన్నికల గుర్తులను రాసి పంపుతున్నారని, ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధమని, పోలీసులకు, ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల అధికారులు పట్టించుకోకుంటే, దీనిపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని టీడీపీ నేతలు ఆందోళన చేస్తున్నారు.

Related posts