telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

పాక్ ని కూడా .. ఇలా ఉతికేయండ్రా .. ఓ కోతిరాజు ..

monkey irritation while washing cloths

మొగుడిమీద బాగా కోపం వచినట్టుగానే ఉంది, అతగాడిని ఏమి చేయలేక ఆ ప్రతాపం అంతా బట్టలపై చూపిస్తుంది..అనుకోవడం వింటూనే ఉంటాం. సొంతగా పనులు చేసుకుంటే ఈ ప్రయోజనం కూడా ఉంటుంది మరి. మనమే ఈజీ అంటూ అన్నిచోట్లా మెషిన్ లను వాడేస్తునాం. దానితో ఫీలింగ్స్ అన్ని లోపలే ఉండిపోయి, లేనిపోని రోగాలు బటయకు వస్తున్నాయి. దీనిని బట్టి అర్ధం అయ్యుంటుంది, సొంతగా పనులు చేసుకుంటే ఎంతటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో.. ఈ విషయం బాగా తెలిసిందనుకుంటా ఆ కోతికి, మొగుడు కొట్టాడో.. మరొకటో.. మొత్తానికి ఆ అక్కసు అంతా కోతి బట్టలు ఉతకడంలో చూపిస్తుంది. బహుశా జమ్మూకశ్మీర్ పై భారత ప్రభుత్వ నిర్ణయంపై పాక్, చైనా వ్యవహారాలు ఆ కోతికి నచ్చలేదేమో.. !

విషయం ఏదైనా కోతి బాగా కోపంగా ఉందని మాత్రం అర్ధం అవుతుంది.. సాధారణంగా కోతులకు కోపం వస్తే పంటపొలాలపైనో లేక ఇళ్ళపైనో పడి .. వస్తువులను పంటలను నాశనం చేస్తుంటాయి. కానీ, మనిషిలా ఇలా బట్టలపై తన ప్రతాపం అంతా చూపిస్తుందేంటో ఈ కోతి. వాటినుండి మనిషి వచ్చాడు కాబట్టి, అవి మనుషులుగా; మనిషి తన జ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ, కోతిగా మారిపోతున్నాడేమో!! ఆ కోతిని చూస్తుంటే అదే అనిపిస్తుంది. బ్రహ్మం గారు చెప్పని విచిత్రం, మనిషిలా కోతి ప్రవర్తించడం. ఈ కోతి నెట్‌లో వైరల్ అవుతోంది. దానిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు..!

Related posts