వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు చంద్రబాబు పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూనే ఉంటారు. తాజాగా మరోసారి చంద్రబాబుపై విజయసాయిరెడ్డి మరోసారి సెటైర్ వేశారు. డాక్టర్ సుధాకర్ నేపథ్యంలో చంద్రబాబుకు చురకలు అంటించారు. పూర్తిగా నమ్మించి గుండెపోటు వచ్చేలా చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తాడని ఫైర్ అయ్యారు. “నీకెందుకు నేనున్నా రెచ్చిపో అంటాడు చంద్రబాబు. మీడియా ముందు పులి వేషాలెయ్యమంటాడు. పూర్తిగా నమ్మించి గుండెపోటు వచ్చేలా వెన్నుపోటు పొడుస్తాడు. ఆనాటి ఎన్టీఆర్ నుంచి డాక్టర్ సుధాకర్ వరకు అంతే. చంద్రబాబు లిస్టులో ఇంకెంతమంది ఉన్నారో?” అంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఇక అంతకు ముందు ట్వీట్ లో “రాష్ట్రంలో కోవిడ్ కట్టడికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అలుపెరుగని కృషి చేస్తోంది. కోవిడ్ మహమ్మారి మొదలైనప్పటి నుంచి నివారణ చర్యల కోసం ఇప్పటివరకూ రూ. 2,246.18 కోట్లు ఖర్చు చేసింది. అశేష ఆంధ్రావని జననేత వైఎస్ జగన్ గారికి అఖండ విజయాన్ని కట్టబెట్టిన రోజు ఇది. ఆ చరిత్రాత్మక విజయానికి నేటికి రెండేళ్లు.” అంటూ విజయసాయిరెడ్డి వెల్లడించారు.