సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన “భారత్” చిత్రం ఈద్ కానుకగా జూన్ 5న విడుదలై మంచి టాక్ తో దూసుకెళ్తోంది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్ళు రాబడుతుంది. వంద కోట్ల క్లబ్‌లో ఈ చిత్రం చేరడం ఖాయం అంటున్నారు. సినిమా సంగతి పక్కన ఉంచితే సల్మాన్ మంచి మనసు భారత్ సినిమా ప్రీమియర్ షోలో మరోసారి బయటపడింది. సల్మాన్ “భారత్” సినిమాని చూసి వెళుతున్న సమయంలో ఆయనని చూసేందుకు జనాలు ఎగబడ్డారు. ఇదే క్రమంలో ఓ బాలుడు కూడా సల్మాన్ దగ్గరకి వెళ్ళే ప్రయత్నం చేశాడు. దీంతో సల్లూ బాడీ గార్డ్ ఆ బాలుడిని నెట్టేశాడు. దీంతో ఆ చిన్నారి కింద పడిపోగా, కనీసం ఆయనని లేపే ప్రయత్నం చేయలేదట సదరు బాడీగార్డ్. దీంతో సీరియస్ అయిన సల్మాన్ బాడీ గార్డ్ చెంప చెళ్ళుమనిపించాడు. ఈ ఘటనకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
previous post
రాజకీయ నాయుకులు ప్రజల సమస్యలపై పోరాడండి- తారక్