telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆకట్టుకుంటున్న “తాగితే తందాన” టీజర్

TT

యంగ్ హీరో సందీప్‌, హీరోయిన్ కొణిదెల నిహారిక చేతుల మీదుగా ‘‘తాగితే తందాన’’ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. అంతకుముందే ఈ టీజర్‌కు సంబంధించిన పోస్టర్‌ను కూడా సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన లభించింది. కాగా ఈ సినిమాలో ఆదిత్, సప్తగిరి, మధునందన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సిమ్రాన్ గుప్తా, రియా హీరోయిన్లుగా నటిస్తున్నారు. రైట్ టర్న్ ఫిలిమ్స్ పతాకంపై ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీనాథ్ బాదినేని తెరకెక్కిస్తుండగా వి.మహేశ్, వినోద్ జంగపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ చిత్రంటీజర్ లో ఆదిత్, సప్తగిరి, మధునందన్ కామెడీ ఆకట్టుకుంటోంది. మీరు కూడా ఈ టీజర్ యూ వీక్షించండి.

Related posts