telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హామీలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం అడుగులు: మంత్రి పువ్వాడ

puvvada ajay

హామీలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలంగాణ మంత్రి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. 30 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పల్లె ప్రగతి కింద ఖమ్మం జిల్లాలోని పంచాయతీలకుట్రాక్టర్లు మంజూయ్యాయి. వీటిని ఎంపిక చేసిన గ్రామ పంచాయతీలకు ఎఆర్ మరియు బిజిఎన్‌ఆర్ కళాశాల మైదానంలో అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నిత్యం పల్లె ప్రగతిని కోరుకుంటారని తెలిపారు. పల్లెప్రగతిలో భాగంగానే సీఎం 30 రోజుల గ్రామ ప్రణాళిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారనీ, ఆ సందర్భంలో ప్రజలకు ఇచ్చిన అన్ని . 30 రోజుల గ్రామ ప్రణాళికలో పల్లెలు పరిశుభ్రంగా తయారయ్యాయని అన్నారు. గ్రామాల్లో మొక్కలు నాటడం, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చడం వంటి కార్యక్రమాలు చేపట్టమని పేర్కొన్నారు.

Related posts