telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

తెలంగాణాలో .. పేదలకు ఇండ్ల పట్టాల పంపిణి.. కేటీఆర్ తో..

KTR Tribute to CRPF Jawans  Hyderabad

గతంలో సర్కార్ పంపిణీ చేసిన స్థలాలకు ఎమ్మెల్యే కేటీఆర్ చొరవతో పట్టాలు అందుకోబోతున్నారు. మూడువేల మంది దరఖాస్తులు చేసుకోగా వారందరికీ నేడు పట్టాలు ఇస్తున్నారు. పేదలందరికీ పట్టాలిచ్చేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. టైటిల్‌తో బ్యాంకు రుణాలు, సర్కార్ సంక్షేమ పథకాలు వర్తించేలా ఇండ్ల స్థలాలకు పక్కాగా పట్టాలు అందించేందుకు కార్యాచరణ రూపొందించింది. దీనితో మూడున్నర దశాబ్దాల కల సాకారం అవుతున్నందుకు బీడీ, నేత కార్మికుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది.

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రాయినిచెరువు (బీవై నగర్)లోని 703 సర్వే నంబర్‌లో 1987లో అప్పటి ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఇండ్ల స్థలాలు ఇచ్చింది. ఇందులో చాలామంది వివిధ జిల్లాల నుంచి బతుకుదెరువు కోసం వచ్చిన నేత, బీడీ కార్మికులే ఉన్నారు. సమైక్య పాలకుల నిర్లక్ష్యం వల్ల సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలోకి కూరుకుపోయింది. ఉపాధి కోల్పోయిన వందలాది మంది కార్మికులు ఆకలిచావులు, ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందులతో అనేకమంది ఇండ్లు, జాగలు అమ్ముకున్నారు. ప్రభుత్వ భూమి అయినందున కొన్న వారి పేరుమీద పట్టా మార్పిడి జరగలేదు. ఇండ్లు కట్టుకున్న వారికి మున్సిపాలిటీలో ఆస్తి పన్నుకట్టాలన్నా తమ పేరు మీద లేకపోవడం, ఎలాంటి అప్పులూ పుట్టకపోవడంతో నేత, బీడీ కార్మికులంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనితో స్పందించిన ప్రభుత్వం ఇళ్ల పట్టాలు పంపిణి ప్రారంభించింది.

రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో బుధవారం ఉదయం 11 గంటలకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిరిసిల్ల ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మూడు వేల మందికి పట్టాలు పంపిణీ చేయనున్నారు. తమకు అండగా ఉండి పట్టాలిచ్చి భరోసా కల్పిస్తున్న కేటీఆర్‌కు రుణపడి ఉంటామని లబ్ధిదారులు అంటున్నారు.

Related posts