telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

బడి మొదటి రోజే ఓ విద్యార్థికి కరోనా…

ప్రస్తుతం కరోనా అన్ లాక్ నిబంధనల్లో భాగంగా కరోనా స్కూల్స్, కాలేజీలు తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ మార్గదర్శకాలు ఇప్పటికే రిలీజ్ చేసింది.  ఈ మార్గదర్శకాలను అనుసరించి స్కూల్స్ రీ ఓపెన్ చేశారు.  అనేక రాష్ట్రాల్లో సోమవారం నుంచి స్కూల్స్ రీ ఓపెన్ అయ్యాయి.  ఉత్తరాఖండ్ లో కూడా సోమవారం నుంచి స్కూల్స్ ప్రారంభం అయ్యాయి.  అయితే,స్కూల్స్ ప్రారంభించిన మొదటిరోజే డెహ్రాడూన్ లోని ఓ పాఠశాలలో విద్యార్థికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది.  దీంతో తరగతి గదిలోని 15 మందిని క్వారంటైన్ కు తరలించారు.  క్లాస్ రూమ్ తో పాటు పాఠశాల మొత్తాన్ని శానిటైజ్ చేశారు.  మూడు రోజులపాటు స్కూల్ ను మూసేస్తున్నట్టు ప్రకటించారు.  రాణిఖేత్ కు చెందిన విద్యార్థి కుటుంబంలో ఒకరి కరోనా సోకింది.  పాజిటివ్ సోకిన వ్యక్తిని కాంటాక్ట్ కావడంతో కుటుంబంలో ఒకరికి కరోనా సోకింది.  దీంతో కుటుంబంలోని అందరికి టెస్టులు నిర్వహించారు.  అయితే, విద్యార్థి స్కూల్ కి వెళ్లిన తరువాత తరగతి గదిలో ఉండగానే పాజిటివ్ వచ్చినట్టు తెలియడంతో స్కూల్ ను మూడు రోజులపాటు మూసేసి శానిటైజ్ చేయాలని పాఠశాల యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. 

 

Related posts