telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

ఎండాకాలం కాకరకాయతో ఇలా చేస్తే.. మంచి ఫలితాలు

ఆరోగ్యం అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైనది. ఆరోగ్యంగా లేకుంటే ఎలాంటి పని చేయలేము. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండటం కోసం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మరీ ముఖ్యంగా మనం తినే ఆహరంపై దృష్టి పెట్టాలి. ఇందులో భాగంగా ఇవాళ ఓ హెల్త్‌ టిప్‌ చుద్దాం. అబ్బ.. చేదు ఏం తింటాంరా బాబూ.. అని కాకరకాయను తోసిపారేసేవాళ్లను చూస్తుంటాం. అయితే అందులో ఉన్న ఔషధ విలువల గురించి తెలిస్తే ఔరా అంటారు. ప్రధానంగా మధుమేహ రోగులపై విశేషంగా ప్రభావం చూపుతుందని అందరికీ తెలిసిన విషయమే. అయితే, కొన్ని రకాల క్యాన్సర్లను అడ్డుకోవడంలోనూ కాకర కాయ రసం భేషుగ్గా పనిచేస్తుందిట. ముఖ్యంగా క్లోమ క్యాన్సర్ నివారించడంలో కాకర సమర్థవంతంగా పనిచేస్తుందని పరిశోధనల్లో వెల్లడైందని కొలరాడో యూనివర్శిటీ అంటోంది. వారి పరిశోధనల్లో క్లోమ క్యాన్సర్ కణాలు.. గ్లూకోజును అందుకోకుండా కాకర రసం నిలువరిస్తుందని తేలింది. దీంతో ,శక్తి అందని క్యాన్సర్ కణాలు క్రమేపీ బలహీన పడి చనిపోతాయని వారు అంటున్నారు. ఇంతకీ కాకర రసం ప్రయోగాలు ఎవరిపై చేశారనుకుంటున్నారా..! ఈ ప్రయోగాలన్నీ ఎలుకలపై చేశారు. తాము గతంలో రొమ్ము క్యాన్సర్ పై చేసిన అధ్యయనం సత్ఫలితాన్నివ్వలేదని ఈ ప్రాజెక్టులో పాలుపంచుకున్న రాజేశ్ అగర్వాల్ తెలిపారు. కాగా, మధుమేహానికి క్లోమ క్యాన్సర్ కూ సంబంధం ఉండడం, పైగా మధుమేహానికి కాకర కాయ వినియోగిస్తుండడం కొలరాడో వర్శిటీని పరిశోధనలకు పురిగొల్పింది.

Related posts